Akhil Raj Incident: నాదే తప్పు.. హీరోను ఏం అనకండి.. డెలివరీ బాయ్ షాకింగ్ స్టేట్మెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhil Raj Incident: ఇటీవల సోషల్ మీడియాలో అత్యంత వివాదాస్పదంగా మారిన టాలీవుడ్ హీరో అఖిల్ రాజ్, ఫుడ్ డెలివరీ బాయ్ వివాదం ఊహించని మలుపు తిరిగింది. మొదట్లో డెలివరీ బాయ్‌పై నెటిజన్లు చూపించిన సానుభూతి, సదరు హీరోపై వచ్చిన ట్రోలింగ్స్ అన్నింటికీ తెరదించుతూ సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి బాధ్యత తనదేనంటూ సదరు డెలివరీ బాయ్ స్వయంగా మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఒక టీవీ ఇంటర్వ్యూలో సదరు డెలివరీ బాయ్ మాట్లాడిన వివరాల ప్రకారం.. అసలు గొడవంతా ఒక రాంగ్ అడ్రస్ డెలివరీతోనే మొదలైంది. ఆర్డర్‌ను లొకేషన్ సరిగ్గా చూసుకోకుండా, అఖిల్ రాజ్ నివసించే అపార్ట్‌మెంట్‌కు ఎదురుగా ఉన్న మరో బిల్డింగ్‌లో ఇవ్వాల్సి ఉండగా అది అఖిల్ రాజ్ ఇంటికి డెలివరీ ఇచ్చాడు. సుమారు 20 నిమిషాల తర్వాత పొరపాటు గ్రహించి వెనక్కి వచ్చిన క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది.
పైగా, సదరు హీరో కుటుంబం పూర్తిగా శాకాహారులు (బ్రాహ్మణులు) కావడంతో, వారి ఇంట్లోకి నాన్‌వెజ్ ఆర్డర్ రావడం వారిని తీవ్రంగా కలచివేసింది. ఈ క్రమంలోనే హీరో తల్లి సదరు డెలివరీ బాయ్‌ని ప్రశ్నించగా, ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఆమె అసలు చదువుకున్నావా అని అడగడంతో డెలివరీ బాయ్ కాస్త సహనాన్ని కోల్పోయినట్లుగా వెల్లడించాడు.
Also Read
- Varanasi: రాజమౌళి గ్లోబల్ బ్రాండ్ + మహేష్ స్టామినా.. ‘వారణాసి’తో ఓవర్సీస్ బాక్సాఫీస్ లెక్కలు మారబోతున్నాయా.?
- Movie Shows: సినిమా టికెట్ ధరలపై సర్కార్ కీలక నిర్ణయం..! ఎర్లీ మార్నింగ్ షోలకు ఓకే.. రేట్ల పెంపునకు నో..!
- CM Chandrababu: అన్ని జెడ్పీ, ఎంపీపీ స్థానాలే టార్గెట్.. సీట్లు రానివారికి తప్పకుండా న్యాయం చేస్తాం!
- AP Elections 2026: ఎస్ఈసీ కీలక సమీక్ష.. ఆ మూడు మండలాల్లో ఎన్నికలు వాయిదా!
అసలు భయం ఇదే!
గతంలో తనకు జరిగిన ఒక రోడ్డు ప్రమాదం కారణంగా దౌడ భాగంలో తీవ్రమైన గాయమైందని, ఆ పాత భయంతోనే హీరో తనపై దాడి చేస్తాడేమోనని కంగారుపడ్డానని డెలివరీ బాయ్ పేర్కొన్నాడు. కేవలం తన ఆత్మరక్షణ కోసమే ఫోన్ తీసి వీడియో రికార్డు చేశానని, అంతేకానీ ఎటువంటి సింపతీ కోసమో, పబ్లిసిటీ కోసమో చేయలేదని స్పష్టం చేశాడు. “ఆ రోజు నా పుట్టినరోజు కావడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాను. పోలీస్ స్టేషన్‌కు వెళ్ళినప్పటికీ ఆవేశం ఆపుకోలేక ఆ వీడియోను నా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసేశాను. కానీ అది ఇంత పెద్ద రచ్చ అవుతుందని, సదరు హీరో అంతగా బద్నాం అవుతాడని నేను ఊహించలేదు.” అని డెలివరీ బాయ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
హీరో అని తెలియకే?
సదరు హీరో నటించిన పాటలకు డెలివరీ బాయ్ గతంలోనే తన భార్యతో కలిసి ఇన్‌స్టా రీల్స్ చేసినట్లు నెటిజన్లు గుర్తించారు. దీనిపై స్పందిస్తూ—”సినిమాల్లో చూసే రూపానికి, ఆ సమయంలో లైవ్‌లో ఆయన ఉన్న లుక్‌కి చాలా తేడా ఉంది. అందుకే ఆయన సెలబ్రిటీ అనే విషయం నాకు అసలు గుర్తుకు రాలేదు. పైగా మిడిల్ క్లాస్ ఆలోచనల ప్రకారం హీరోలు ఇలాంటి అపార్ట్మెంట్లలో ఉంటారని నేను అనుకోలేదు. ఉదయాన్నే వెళ్లి వీడియో డిలీట్ చేసి సారీ చెబుదామనుకునే లోపే అంతా వైరల్ అయిపోయింది” అని క్లారిటీ ఇచ్చాడు. తల్లి ఉమ్మి వేసిందన్న ఆరోపణల్లో కూడా వాస్తవం లేదని, ఇప్పుడు తవ్వుకుంటూ పోతే తప్పులన్నీ తనవైపే వస్తాయని ఒప్పుకున్నాడు డెలివరీ బాయ్
డెలివరీ బాయ్స్ కు కీలక విజ్ఞప్తి
ఈ వివాదం వైరల్ కావడంతో తోటి డెలివరీ బాయ్స్ భారీ సంఖ్యలో హీరో అఖిల్ రాజ్ ఇంటి ముట్టడికి ప్రయత్నించడం, కారు అద్దాలు పగులగొట్టేందుకు యత్నించడం సంచలనం సృష్టించింది. దీనిపై సదరు డెలివరీ బాయ్ స్పందిస్తూ తాను ఎవరినీ రెచ్చగొట్టలేదని, గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టలేదని చెప్పాడు. చివరగా పబ్లిక్కు, తోటి డెలివరీ బాయ్స్‌కు విజ్ఞప్తి చేస్తూ—”ఈ ఘటనలో ఇద్దరి తప్పు ఉంది, కానీ ఎక్కువ తప్పు నాదే. హీరో అఖిల్ రాజ్‌ను, వారి కుటుంబాన్ని బూతులు తిట్టడం, ట్రోల్ చేయడం దయచేసి ఇప్పుడైనా ఆపేయండి. నా తప్పును నేను బహిరంగంగా ఒప్పుకుంటున్నాను. ఆయన నాపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకున్నా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను” అంటూ ముగించాడు.
తాజావార్తలు
-
Varanasi: రాజమౌళి గ్లోబల్ బ్రాండ్ + మహేష్ స్టామినా.. ‘వారణాసి’తో ఓవర్సీస్ బాక్సాఫీస్ లెక్కలు మారబోతున్నాయా.?
-
US Midterm Elections 2026: మిచిగాన్ నుంచి తొలి ముస్లిం సెనేటర్‌గా చరిత్ర సృష్టించిన డెమోక్రాట్.. అబ్దుల్ ఎల్-సయీద్ ఎవరు?
-
Movie Shows: సినిమా టికెట్ ధరలపై సర్కార్ కీలక నిర్ణయం..! ఎర్లీ మార్నింగ్ షోలకు ఓకే.. రేట్ల పెంపునకు నో..!
-
CM Chandrababu: అన్ని జెడ్పీ, ఎంపీపీ స్థానాలే టార్గెట్.. సీట్లు రానివారికి తప్పకుండా న్యాయం చేస్తాం!
-
IND vs NZ 1st ODI: కోహ్లీ, రోహిత్, గిల్‌కు అరుదైన గౌరవం!
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!