Lenin: లెనిన్ హిట్ టాక్.. నాగ్’ను పట్టుకుని ఏడ్చేసిన అఖిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎట్టకేలకు అక్కినేని వారసుడు అఖిల్ ఊరిస్తున్న ఆ సాలిడ్ సక్సెస్ బాక్సాఫీస్ వద్ద దక్కింది. ఎన్నో వాయిదాల తర్వాత ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ‘లెనిన్’ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల వద్ద పాజిటివ్ హిట్ టాక్ రావడంతో అక్కినేని క్యాంప్‌లో పండగ వాతావరణం నెలకొంది. కెరియర్ ప్రారంభం నుండి సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్, ఈ సినిమాతో ఒక బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడంతో అక్కినేని కుటుంబంలో భావోద్వేగాలు ఒక్కసారిగా బద్దలయ్యాయి.
సినిమాకు మార్నింగ్ షోల నుంచే పాజిటివ్ రివ్యూస్ వస్తుండటంతో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలకు అఖిల్ తండ్రి, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్ర దర్శకుడు మురళీకృష్ణ నిర్మాత నాగవంశీతో కలిసి నాగార్జున, అఖిల్‌లు అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా కేక్ కట్ చేసి ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సక్సెస్ మీట్లో ఒక అద్భుతమైన ఎమోషనల్ సీన్ చోటుచేసుకుంది. ‘ఏజెంట్’ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత రెండేళ్ల పాటు పడిన కష్టం, ఎదుర్కొన్న విమర్శలన్నింటికీ ఈ ‘లెనిన్’ సక్సెస్‌తో సమాధానం దొరకడంతో అఖిల్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు. కేక్ కట్ చేసిన వెంటనే తన తండ్రి నాగార్జునను గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు. కొడుకు కళ్లల్లో ఆనంద బాష్పాలను చూసిన నాగార్జున కూడా అంతే ఎమోషనల్ అవుతూ అఖిల్‌ను దగ్గరకు తీసుకుని వెన్నుతట్టి ఓదార్చారు. ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read
- Gaddam Prasad: "చర్యలు తీసుకుంటాం".. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
- Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
- Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్‌ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హెడ్ కానిస్టేబుళ్లపై సిట్ ఫోకస్
లెనిన్ సినిమాకి హిట్ టాక్
అన్నపూర్ణ స్టూడియోలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసిన నాగార్జున
తండ్రిని పట్టుకుని ఎమోషనల్ అవుతూ ఏడ్చేసిన అఖిల్…#AkhilAkkineni #Lenin #Tollywood #BhagyashriBorse #Nagarjuna pic.twitter.com/DxtnohctNS
— NTV Breaking News (@NTVJustIn) July 10, 2026
తాజావార్తలు
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
-
Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
-
Ramayana-Yash: రావణుడిగా విశ్వరూపం.. ‘రామాయణ’ పార్ట్-1లో యశ్ స్క్రీన్ టైమ్ అంతనా?
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!