Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
- ‘అఖండ-3’ సినిమా..
- దర్శకుడు బోయపాటి శ్రీను కీలక అప్డేట్
- ‘అఖండ-3’ తప్పకుండా వస్తుందంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhanda 3 Update Boyapati Srinu: దర్శకుడు బోయపాటి శ్రీను తన తదుపరి ప్రాజెక్ట్ ‘అఖండ-3’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు ఉదయం తిరుమలలోని వెంకటేశ్వరస్వామిని దర్శనం కోసం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు. ‘అఖండ-3’ తప్పకుండా వస్తుందని, అయితే సినిమాపై ఆసక్తిని కొనసాగించేందుకు సరైన సమయం చూసి అప్డేట్స్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.
అఖండ-3పై క్లారిటీ
‘అఖండ-3’ గురించి అడిగిన ప్రశ్నకు బోయపాటి శ్రీను స్పందిస్తూ.. ఈ సినిమాను తప్పకుండా చేస్తామని చెప్పారు. సినిమాకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు కాకుండా, కొంత గ్యాప్ ఇస్తూ వెల్లడిస్తేనే ప్రేక్షకుల్లో ఆసక్తి కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. బాలకృష్ణతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను సరైన సమయంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
Also Read
- Gautam Gambhir: "కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు".. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
ఆయనతో సినిమా అంటే వేరే లెవెల్
బాలకృష్ణతో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తానని బోయపాటి శ్రీను అన్నారు. ఆయన ఒక లెజెండ్ అని, అలాంటి హీరోతో సినిమా చేస్తే అది మరో స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. ‘అఖండ’ తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ‘అఖండ-3’పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని పెంచుతున్నాయి.
టాలీవుడ్‌కు మంచి రోజులు
ప్రస్తుతం టాలీవుడ్ భారతదేశంలో అగ్రస్థానంలో ఉందని బోయపాటి శ్రీను అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఇది చాలా గొప్ప సమయమని పేర్కొన్నారు. పరిశ్రమ ఈ స్థాయికి చేరుకోవడం పట్ల ప్రతి ఒక్కరూ సంతోషించాల్సిన విషయమన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ హీరోలు నాలుగు పిల్లర్లుగా నిలిచారని బోయపాటి శ్రీను పేర్కొన్నారు. వారిని ఫౌండేషన్‌గా అభివర్ణిస్తూ.. వారిలో బాలకృష్ణ, చిరంజీవి దిగ్గజ నటులని కొనియాడారు.
ఇలాంటి దిగ్గజ హీరోలతో కలిసి పనిచేయాలంటే అదృష్టం ఉండాలని బోయపాటి శ్రీను అన్నారు. వారి స్థాయికి తగ్గట్టుగా సినిమాలను రూపొందించాల్సి ఉంటుందని చెప్పారు. చిన్న హీరోల సినిమాలు, తమ సినిమాలు ఇలా అన్ని అంశాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?