నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘అఖండ 2: తాండవం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, చిత్ర యూనిట్ తెలంగాణలో టికెట్ ధరలకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేసింది. జనవరి 1వ తేదీ నుండి తెలంగాణ వ్యాప్తంగా చాలా తక్కువ ధరలకే టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. సామాన్య ప్రేక్షకుడికి కూడా సినిమాను చేరువ చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. కాగా
Also Read : Santhana Prapthirasthu : ఓటీటీలో దూసుకుపోతున్న ‘సంతాన ప్రాప్తిరస్తు’..
ఈ కొత్త ధరల ప్రకారం, తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలను రూ. 50, రూ. 80 మరియు రూ. 105 గా నిర్ణయించారు. అలాగే మల్టీప్లెక్స్ థియేటర్ లో కూడా కేవలం రూ. 150 లకే సినిమాను వీక్షించే అవకాశం కల్పించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం 3D ఫార్మాట్లో కూడా ప్రేక్షకులను అలరించనుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తక్కువ ధరలకే బాలయ్య మాస్ తాండవాన్ని వెండితెరపై చూసే అవకాశం రావడంతో నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు.