బాలయ్య – బోయపాటిల అఖండ 2 వాయిదా పండింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఈరోస్ నౌ సంస్థకు మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవిల కారణంగా ఈ రోజు విడుదల కావాల్సిన అఖండ 2 రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఈరోస్ నౌకు చెల్లించాల్సిన డబ్బులు క్లియర్ చేసే వరకు రిలీజ్ చేయవద్దని అఖండ 2 విడుదలపై తాత్కాలిక నిషేధం విధిస్తు మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Also Read : Akhanda2 : అఖండ- 2 రిలీజ్ వాయిదాకి అసలు కారణం ఇదే
రిలీజ్ వాయిదా పడడంతో కంగుతిన్న 14 రీల్స్ ప్లస్ మేకర్స్ ఈరోస్ నౌతో నెలకొన్న ఆర్థిక లావాదేవిల వ్యవహారాన్ని క్లియర్ చేశారు. అలాగే అఖండ 2 కు ఫైనాన్స్ చేసిన ఫైనాన్షియర్ వ్యవహారాన్ని కూడా క్లోజ్ చేశారు. కానీ మద్రాస్ హై కోర్టు ఇచ్చిన తాత్కాలిక నిషేధం కారణంగా ఈ రోజు రిలీజ్ కు అడ్డంకి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టులో రీల్స్ LLP అప్పీల్ చేయనుంది. ఈ కేసు చెన్నై హైకోర్టులో ఈరోజు విచారణకు రానుంది. సానుకూల ఫలితం వస్తే సినిమా విడుదల కావచ్చు లేదంటే మాత్రం విడుదల మరింత ఆలస్యం అవుతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ రోజు సాయంత్రం ప్రీమియర్స్ ప్లాన్ చేసి రేపటి నుండి రెగ్యులర్ షోస్ ప్రదర్శిస్తారని తెలుస్తోంది. సమస్య పరిష్కరించకుంటే మాత్రం వారాంతంలో విడుదల చేయడం అసాధ్యం. అసలు ఈ సినిమా విడుదల అవుతుందా విడుదలైతే ఎప్పుడు అవుతుంది. అసలు ఈ వివాదంనుండి మేకర్స్ ఎలా బయటపడతారోనని నందమూరి ఫ్యాన్స్ టెన్సన్ పడుతున్నారు.