నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘అఖండ-2′. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, ప్రగ్య జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. షూటింగ్ తో పాటు డబ్బింగ్ పనులను ముగించుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Also Read : Thalaivar173 : రజనీ – కమల్ సినిమా నుండి సుందర్ సి ఎందుకు తప్పుకున్నాడంటే?
కాగా ఈ సినిమాను ఏడాది డిసెంబరు 5 న రిలీజ్ చేస్తున్నామని ఇదివరకే ప్రకటించారు. అందుకు సంబందించి ప్రోమోస్ కూడా రిలీజ్ చేసారు. అయితే డిసెంబరు 5 డేట్ కు అఖండ 2 రావడం లేదని ఓ న్యూస్ టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. డిసెంబరు రిలీజ్ కు కేవలం 20 రోజులు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పటీకి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయలేదు మేకర్స్. ఇది కూడా ఒకరకంగా అఖండ 2 రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందని వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. అఖండ 2 మేకర్స్ సంక్రాంతి రేస్ లోకి తమ సినిమాను దింపాలని అణువుకుంటున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 9న రాజాసాబ్ రిలీజ్ కావాల్సి ఉండగా ఆ సినిమా ఇంకా వర్క్ ఫినిష్ కాలేదని ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అవుతుందేమో అని ఓ గాసిప్ వినిపిస్తుండగా ఒకవేళ రాజాసాబ్ రాకుంటే ఆ డేట్ ను తమ సినిమాను దింపాలని అఖండ 2 మేకర్స్ భావిస్తున్నారు. అదే జరిగితే సంక్రాంతికి మరోసారి బాలయ్య Vs చిరు పొంగల్ ఫైట్ షురూ అయినట్టే.