ఎంఐఎం పార్టీకి చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్ చేశారు. బార్కాస్ సలాల లో ఇవాళ (శనివారం) ఓవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాటి ఘటనలో క్షతగాత్రుడిగా ఉన్న తనను ప్రాణాలకు తెగించి కాపాడిన ఎమ్మెల్యే బలాల, మజ్లీస్ కార్యకర్తలకు ఊపిరున్నంత వరకు రుణపడి ఉంటానన్నారు. ఆ సమయంలో తనను వదిలేసి పారిపోయిన వారిని, తనను చంపేందుకు యత్నించిన వారిని కూడా బార్కాస్ ప్రజల ముందే క్షమిస్తున్నా అని ఒవైసీ పేర్కొన్నారు.
Read Also: Rekha Nair: అక్కడ చెయ్యి వేస్తే, నేను బాగా ఎంజాయ్ చేస్తా.. టీవీ నటి సంచలన కామెంట్స్
కాగా.. 2011 ఏప్రిల్ 30న చాంద్రాయణగుట్ట పరిధిలోని కార్వాన్‌లో జరుగుతున్న ఓ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న అక్బరుద్దీన్ ఒవైపీపై కొందరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. అక్కడితో ఆగని దుండగులు ఆపై కత్తులు, డాగర్లతో అక్బరుద్దీన్ పై.. ఆయన అనుచరులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రంగా గాయపడి చావు అంచుల దాకా వెళ్లొచ్చారు.
Read Also: Gudivada Amarnath: వచ్చే వైఎస్సార్ జయంతి నాటికి.. జగన్ రెండోసారి సీఎం కావాలి..
అయితే అక్బరుద్దీన్ గన్‌మెన్ జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు దుండగులు చనిపోయారు. అక్బరుద్దీన్ ఒవైసీపై దాడికి పాల్పడింది ఎంబీటీ పార్టీకి చెందిన మొహమ్మద్ పహిల్వాన్‌గా పోలీసుల విచారణ తేలింది. ఓ ఆస్తికి సంబంధించిన వివాదం కారణంగానే అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం అటాక్ జరిగిందని సమాచారం. అయితే.. ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్న అక్బరుద్దీన్ ప్రతీకారంతో రగిలిపోయి తనపై దాడి చేసిన వారిపై పగ తీర్చుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను అక్బరుద్దీన్ తలకిందులు చేశారు. తనపై దాడి చేసిన వారిని క్షమిస్తున్నాను అని తన పెద్ద మనసు చాటుకున్నాడు.
Read Also: ChatGPT: అన్ని లోకల్ లాంగ్వేజ్ లోకి చాట్ జీపీటీ..
ఇటీవల ఓ చానల్, ఓ పత్రికలో తన కుమారుడు నూరుద్దీన్ ఓవైసీకి టికెట్ అంటూ వచ్చిన వార్తలను అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. రాజకీయాలలోకి తన కుటుంబాన్ని మరోసారి లాగొద్దని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలో ముస్లింల పరిస్థితి బాగలేదని, దేశ వ్యాప్తంగా ముస్లింలంతా ఏకధాటి పై వచ్చి ఎంఐఎం పార్టీ బలోపేతానికి కృషిచేయాలని అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు.