ఈమధ్య హీరోయిన్ల ఎక్స్పోజింగ్ ఎక్కువైంది.. చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా కూడా అందాల ఆరబోత లో మాత్రం తగ్గట్లేదు.. నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ గ్లామర్ డోస్ పెంచుతున్నారు.. కుర్ర హీరోయిన్లు కూడా సోషల్ మీడియాను నమ్ముకున్నారు.. తాజాగా ఆ లిస్ట్ లోకి మరో ముద్దుగుమ్మ చేరింది.. హీరో సుమంత్ నటించిన మళ్లీ రావా సినిమా ఫెమ్ హీరోయిన్ ఆకాంక్ష సింగ్ గుర్తే ఉంది కదా.. ఆ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది.. ఆ సినిమా హిట్ అవ్వక పోవడంతో ఆ తర్వాత పెద్దగా సినిమాలు చెయ్యలేదు..
మళ్ళీ రావా చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ విమర్శకు ల ప్రశంసలు దక్కించుకుంది. ఆకాంక్ష నటనకి కూడా మంచి మార్స్క్ పడ్డాయి.. హిందీలో టీవీ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన ఆకాంక్ష సింగ్ నటిగా మంచి గుర్తింపు పొందింది. హీరోయిన్ గా మాత్రం పెద్దగా పేరు తెచ్చుకోలేక పోయింది.. ఇక ఆకాంక్ష కి మరోసారి తెలుగులో ఛాన్స్ రాలేదు. కన్నడ, హిందీ , తమిళ చిత్రాల్లో కూడా ఈ యంగ్ బ్యూటీ నటించింది.. కానీ మళ్ళీ రావా చిత్రానికి గాను బెస్ట్ ఫ్యామిలీ డెబ్యూ హీరోయిన్ గా సైమా అవార్డ్స్ లో నామినేట్ అయింది..
అప్పటి నుంచి ఇప్పటివరకు ఆకాంక్షకు తెలుగులో ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా రాలేదు.. దీంతో అందరిలాగే సోషల్ మీడియాను నమ్ముకుంది.. ప్రస్తుతం ఆకాంక్ష అవకాశాల కోసం గ్లామర్ అవతారం ఎత్తుతోంది. సోషల్ మీడియా లో ఆమె ఫోజులు నెటిజన్లని ఆకర్షించే విధంగా ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ పోజుల తో బ్లాక్ డ్రెస్ లో హాట్ హాట్ గా ఎక్స్ ఫోజింగ్ చేస్తూ ఆకాంక్ష ఇస్తున్న ఫోజులు కుర్రకారకు మత్తెక్కిస్తున్నాయి.. మొత్తానికి ఈ అమ్మడు సోషల్ మీడియా లో ఫాలోయింగ్ ను పెంచుకొనే పనిలో పడింది.. ఈ గ్లామర్ ను చూసైన మంచి ప్రాజెక్ట్స్ ఈ అమ్మడుకు వస్తాయేమో..