Site icon NTV Telugu

Mankatha: అజిత్ ‘మంకత’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..

Makatha, Ajith

Makatha, Ajith

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో ‘మంకత’ (Mankatha) ఒకటి. 2011లో రిలీజైన ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనం. అజిత్ 50వ సినిమాగా వచ్చిన ఈ మూవీ, ఆయనకు ఒక కొత్త ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో అజిత్ పోషించిన నెగిటివ్ షేడ్స్ ఉన్న ‘వినాయక్ మహదేవ్’ పాత్ర, ఆయన సిగ్నేచర్ ‘సాల్ట్ అండ్ పెప్పర్’ లుక్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ క్లాసిక్ యాక్షన్ థ్రిల్లర్ మళ్ళీ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

Also Read : Swayambhu : నిఖిల్ భారీ పీరియాడిక్ మూవీ ‘స్వయంభు’ వాయిదా?

తాజాగా సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని జనవరి 23, 2026న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా, కేవలం కొన్ని గంటల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అజిత్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పడానికి ఇదే నిదర్శనం. అంతే కాదు ఈ సినిమాను హై క్వాలిటీ 4K వెర్షన్ లేటెస్ట్ సౌండ్ టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. పాత రోజులను గుర్తు చేసుకుంటూనే, సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్ పొందేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే ఒక గ్యాంగ్ స్టర్ డ్రామాగా, మనీ హైస్ట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అజిత్ చెప్పే డైలాగులు, ఆయన స్టైలిష్ యాక్షన్ ఫ్యాన్స్‌కు మళ్ళీ కన్నుల పండుగ చేయబోతున్నాయనమాట. ఇంకో విషయం ఏంటంటే.. అదే రోజు దళపతి విజయ్ నటించిన మాస్ హి హిట్ మూవీ ‘తేరి’ (Theri) కూడా రీ-రిలీజ్ అవుతుంది. చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు మళ్ళీ తలపడుతుండటంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ పీక్స్‌కు చేరుకున్నాయి.

Exit mobile version