NTV Telugu Site icon

Vidaamuyarchi Teaser: డైలాగ్స్‌ లేవమ్మా, ఫుల్ యాక్షన్‌.. ఆసక్తిగా’తలా’ విదాముయార్చి టీజర్‌!

Vidaamuyarchi Teaser

Vidaamuyarchi Teaser

కోలీవుడ్ స్టార్ హీరో ‘తలా’ అజిత్ కుమార్‌ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘మంగాత’ (గ్యాంబ్లర్). ఇందులో అజిత్, సౌత్ క్వీన్ త్రిష‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్ త్ర‌యం త‌మదైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. మ‌రోసారి ఈ కాంబో ఆడియెన్స్‌ను మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఏకే 62గా వస్తోన్న ‘విదాముయార్చి’లో అజిత్, త్రిష‌, అర్జున్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌ విలన్‌గా నటిస్తున్నారు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

తలా ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విదాముయార్చి టీజర్‌ రానే వచ్చింది. ఒక నిమిషం 48 సెకండ్ల నిడివి గల టీజర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేదు. మేకర్స్ టీజర్‌ను ఫుల్ యాక్షన్‌తో రిలీజ్ చేశారు. సినిమాలో నటించిన అందరి యాక్టర్లపై వచ్చే సన్నివేశాలతో టీజర్‌ కట్ చేసి.. సినిమాలో ఏదో మిస్టీరియస్ ఎలిమెంట్‌ ఉందని హింట్ ఇచ్చారు. అజిత్ ఎవరి కోసమో వెతుకున్నట్లు అర్ధమవుతోంది. ఇక సినిమాను సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌కటించారు.

Also Read: Pushpa 2: ముంబై మేరీ జాన్.. ఇండియన్ సినిమా ‘కింగ్’ వస్తున్నాడు!

విదాముయార్చి టీజర్‌లో డైలాగ్స్‌ లేకున్నా.. అద్భుతంగా ఉంది. టీజర్‌ చూస్తే సినిమా తప్పక చూడాలనిపించడం ఖాయం. అజిత్ తన యాక్షన్‌, యాక్టింగ్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. ఇందులో ఆర‌వ్‌, రెజీనా క‌సాండ్ర‌, నిఖిల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. కోలీవుడ్ మ్యూజిక‌ల్ రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్నిఅందిస్తుండ‌గా.. ఓం ప్ర‌కాష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఉన్నారు. విడాముయ‌ర్చి సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా.. ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. ఇక సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుంది.

Show comments