Site icon NTV Telugu

Ajit Doval: పాక్- భారత్ వివాదం.. అజిత్ దోవల్‌తో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి!

Ajit Doval

Ajit Doval

పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో భారత సిబ్బందిలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని, ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని దోవల్ పేర్కొన్నారు. యుద్ధం భారత్ తమ ఛాయిస్ కాదని ఆయన నొక్కి చెప్పారు.

READ MORE: Virender Sehwag: ‘కుక్క తోకర వంకర’.. పాక్‌ దాడిపై సెహ్వాగ్ సంచలన ట్వీట్

అజిత్ దోవల్ వివరణపై స్పందించిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడారు. “పహల్గాం ఉగ్రదాడిని చైనా ఖండిస్తుంది. అన్నిరకాల ఉగ్రవాదాన్ని చైనా వ్యతిరేకిస్తుంది. భారత్, పాక్ రెండూ చైనా పొరుగు దేశాలు. ఇరుదేశాలు ప్రశాంతంగా, సంయమనంతో ఉంటాయని, చర్చలు, సంప్రదింపులు ద్వారా విభేదాలను పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నాం. భారత్​-పాక్​ల మధ్య శాశ్వత కాల్పుల విరమణకు చైనా మద్దతు ఉంటుంది” అని అన్నారు.

READ MORE: China: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత.. చైనా విదేశాంగ మంత్రి కీలక ప్రకటన..

Exit mobile version