Airtel: రీఛార్జ్‌లో మోత.. వ్యాలిడిటీలో కోత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel: ఎయిర్‌టెల్ మినిమం రీఛార్జ్ 99 రూపాయల నుంచి 155 రూపాయలకు పెరిగింది. ఇలా ఒక్కసారే 56 రూపాయలు పెంచటం ఇదే ఫస్ట్ టైమ్. పైగా.. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ ఖరీదు ఎక్కువ.. వ్యాలిడిటీ తక్కువ కావటం గమనించాల్సిన విషయం. 155 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే 24 రోజుల వరకు మాత్రమే వస్తుంది. నెల తిరిగే లోపు మళ్లీ 155 రూపాయలు ఇచ్చి రీఛార్జ్ చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
రిలయెన్స్ జియో ఇదే అమౌంట్‌కి 28 రోజుల వ్యాలిడిటీ ఇస్తుండటం విశేషం. వొడాఫోన్ ఐడియా కూడా ఎయిర్‌టెల్ మాదిరిగానే 155 రూపాయలకు 24 రోజుల వ్యాలిడిటీనే అమలుచేస్తోంది. కొత్త రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా ఎయిర్‌టెల్ ఒక జీబీ డేటా మాత్రమే అందిస్తుంటే రిలయెన్స్ జియో రెండు జీబీలు ఇస్తోంది. వొడాఫోన్ ఐడియా.. ఎయిర్‌టెల్ లాగే ఒక్క జీబీ డేటానే ప్రొవైడ్ చేస్తోంది.
Also Read
- Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
- Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.. “ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్”
- Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
- Sai Pallavi Saree Look: "మేడం సార్.. మేడం అంతే".. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
read more: Blockbuster Vs Netflix: ఓటమి అంచుల నుంచి.. విజయ తీరాలకు. తెలుసుకోవాల్సిన ‘బ్లాక్‌బస్టర్’ స్టోరీ
ఎస్‌ఎంఎస్‌ల సంఖ్య విషయంలో ఈ మూడు టెలికం కంపెనీలు ఒకే విధానాన్ని అనుసరిస్తున్నాయి. 300 ఎస్‌ఎంఎస్‌లు పంపుకోవచ్చని చెబుతున్నాయి. ఎయిర్‌టెల్ 129 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌ని 179 రూపాయలకు పెంచిన సంగతి తెలిసిందే. 129 రూపాయలకు ఒక జీబీ డేటా, 28 రోజులు అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 ఎస్‌ఎంఎస్‌లు ఇచ్చింది.
179 రూపాయలకు రెండు జీబీల డేటా, 28 రోజులు అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన 155 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌లో వ్యాలిడిటీని 24 రోజులు మాత్రమే ఇవ్వటం పట్ల వినియోగదారుల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
KTR : సింగరేణి స్కామ్‌పై కేటీఆర్ సవాల్.. రేవంత్‌కు డైరెక్ట్ ఛాలెంజ్
-
Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
-
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.. “ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్”
-
Apple iPhone Duo: ఆపిల్ iPhone Duo ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే.. రూ.7,000 క్యాష్‌బ్యాక్, ధర ఎంతంటే!
-
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!