జనసేన అధినేత పవన్ కల్యాణ్ బెజవాడ ప్రయాణం వాయిదా పడింది. పవన్ శంషాబాద్ నుంచి రావాల్సిన విమానం టేకాఫ్ కు నిరాకరించడంతో వాయిదా పడింది. దీంతో గన్నవరం విమానాశ్రయం దగ్గర నుంచి నాదెండ్ల మనోహర్ వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల పక్షంగా నిలబడి పోరాటం చేస్తున్న రాజకీయ పార్టీల్ని, వ్యక్తుల్ని ప్రత్యేకంగా వారి పైన కక్ష సాధింపు కోసం చేస్తున్న చర్యలను జనసేన ఖండిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ.. పవన్ కల్యాణ్ సంఘీభావం తెలపడానికి హైదరాబాద్ నుండి బయలుదేరితే ఆయన ప్రయాణించే ప్రత్యేక విమానాన్ని టేక్ ఆఫ్ అవ్వకుండా ఎయిర్ పోర్ట్ సిబ్బంది నిలిపివేశారని పేర్కొన్నారు.
Rose Cultivation: గులాబీలో తెగుళ్ల సంరక్షణ చర్యలు..
ఇంత అరాచకమైన పరిపాలన ఎందుకు.. పవన్ కల్యాణ్ వస్తుంటే మీరు ఎందుకు భయపడుతున్నారని నాదెండ్ల ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ వచ్చి మంగళగిరి పార్టీ ఆఫీసులో భవిష్యత్తు కార్యచరణ నిమిత్తం సీనియర్ నాయకులతో సమావేశం నిమిత్తం రానున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా జీవించాలంటే ఎందుకు ఈ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతుందని ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారికంలోకి వచ్చిన ఒక వ్యక్తి రాష్ట్రంలో రాజకీయ విధ్వంశాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు మొత్తం నిలిపివేశారని.. ఎక్కడ చూస్తే అక్కడ పోలీసులు నిర్బంధ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.
G20 Summit Live Updates: గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
పవన్ కల్యాణ్ విజయవాడ బయలుదేరితే ఆయన విమానాన్ని టేకాఫ్ కాకుండా నిలిపేసారంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నాము అర్థమవుతుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలంతా చంద్రబాబు అరెస్ట్ ను ముక్తకంఠంతో ఖండించాలి అందరూ ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో పరిపాలన గురించి ప్రజలందరూ ఒకసారి అర్థం చేసుకోండి.. ఇందుకేనా జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు ఇచ్చిందని అన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కి పవన్ కల్యాణ్ ను రిసీవ్ చేసుకోవడానికి తాను వస్తున్న సమయంలో కూడా.. దారి పొడుగునా పోలీసులు ఆంక్షలు ఉన్నాయన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ సృష్టించేది కేవలం వైసీపీ నాయకులేనని ఆయన తెలిపారు.