DGCA: ఎయిరిండియా విమానాల్లో తోటి ప్రయాణికులపై మూత్రవిసర్జన చేసిన ఘటనలు రెండు జరిగాయి. ఎయిరిండియా విమానంలో జరిగిన ఘటనపై డీజీసీఏ సీరియస్ అయింది. ఎయిరిండియా మేనేజర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. గత నెల 6న ప్యారిస్-ఢిల్లీ విమానంలో మూత్రం పోసిన ఘటనపై నిబంధనల ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోలేదని షోకాజ్ నోటీసులో ప్రస్తావించింది. ఈ కేసులో నిబంధనలు పాటించని ఎయిరిండియాపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ డీజీసీఏ ప్రశ్నించింది. వికృతి చేష్టలకు పాల్పడ్డ ప్రయాణికులపై ఎందుకు వెంటనే చర్యలు తీసుకోలేదని నోటీసులో ప్రస్తావించింది.
Viral Letter: భార్యను బుజ్జగించుకోవాలి.. లీవ్ ఇవ్వండి.. ఏఎస్పీకి కానిస్టేబుల్ లెటర్
న్యూయార్క్-ఢిల్లీ విమానంలో వెల్స్ ఫార్గో సంస్థ ఉపాధ్యక్షుడు శంకర్ మిశ్రా మద్యం మత్తులో ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేయడం తెలిసిందే. ఇది జరిగిన పది రోజుల తర్వాత ప్యారిస్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మద్యం మత్తులో అతడు కూడా తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. విమానంలో అనుచిత ప్రవర్తనకు పాల్పడే ప్రయాణికుల పట్ల అనుసరించాల్సిన విధివిధానాలను కూడా ఎయిరిండియా పాటించలేదని గుర్తించింది. ఈ ఘటనపై ఆలస్యంగా స్పందించడమే కాకుండా, సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని డీజీసీఏ తన నోటీసుల్లో ఆక్షేపించింది. న్యూయార్క్-ఢిల్లీ విమాన ఘటనకు సంబంధించి డీజీసీఏ ఈ నెల 5న నోటీసులు జారీ చేసింది. నాలుగు రోజుల వ్యవధిలో తాజా నోటీసులు జారీ చేసింది.