Hamas Israel War : హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం.. ఎయిర్ ఇండియా విమానాలు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hamas Israel War : హమాస్, ఇజ్రాయెల్ మధ్య గత సంవత్సరం అక్టోబర్ 7 నుండి యుద్ధం జరుగుతోంది. ఆ తర్వాత హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే మరణం తరువాత ఈ యుద్ధం ఊహించని విధంగా పెరిగింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. మరోవైపు ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్ వెళ్లాల్సిన విమానాన్ని భారత విమానం ఎయిరిండియా రద్దు చేసింది. ఆపరేషనల్ కారణాలతో ఎయిర్ ఇండియా గురువారం రాజధాని నుండి టెల్ అవీవ్‌కు తన విమానాన్ని రద్దు చేసింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా, భద్రత విషయమై ఈ చర్య తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రస్తుతానికి విమానాన్ని రద్దు చేసినట్లు పేర్కొంది.
ఆగస్ట్ 1న విమానం రద్దు
ఎయిర్ ఇండియా ప్రతి వారం ఢిల్లీ నుండి టెల్ అవీవ్ కు నాలుగు విమానాలను నడుపుతోంది. తన వెబ్సైట్లో టెల్ అవీవ్‌కు విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా తన వెబ్సైట్లో ప్రకటించింది. ఆపరేషనల్ కారణాల వల్ల, ఢిల్లీ నుండి టెల్ అవీవ్‌కి తన ఫ్లైట్ AI139, ఆగస్టు 1న టెల్ అవీవ్ నుండి ఢిల్లీకి AI140 విమానాన్ని రద్దు చేసినట్లు తెలిపింది. ఈ రెండు విమానాల్లో ప్రయాణించడానికి ధృవీకరించబడిన బుకింగ్‌లు ఉన్న ప్రయాణికులకు వారి టిక్కెట్ డబ్బు తిరిగి చెల్లించబడుతుందని ప్రకటన పేర్కొంది. ఎయిర్ ఇండియా కూడా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది.
Also Read
- Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
- Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
గతేడాది అక్టోబరు నుంచి ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. ఇటీవల, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోకి ప్రవేశించి ఇజ్రాయెల్ తన అతిపెద్ద శత్రువు హమాస్ అధ్యక్షుడు ఇస్మాయిల్ హనియాను హతమార్చింది. ఆ తర్వాత యుద్ధం మరింత పెరిగింది. అంతకుముందు గతేడాది అక్టోబర్ 7న హమాస్ గ్రూపు ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైంది. ఇందులో ఇప్పటి వరకు వేలాది మంది పాలస్తీనియన్లు మరణించారు. చాలా మంది గాయపడ్డారు.
ఇస్మాయిల్ హనియా ఎవరు?
హమాస్ గ్రూపు అధ్యక్షుడిగా ఉన్న ఇస్మాయిల్ హనియా గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడికి పూర్తిగా ప్లాన్ చేశాడు. హనీయా ఆదేశాల మేరకు హమాస్ యోధులు పని చేసేవారు. అతను 2006 నుండి హమాస్ సుప్రీం కమాండర్. హనియా మృతిపై హమాస్ ప్రకటన కూడా వెలువడింది. హనియా మృతికి ఇజ్రాయెల్ హస్తం ఉందని ఉగ్రవాద సంస్థ పేర్కొంది.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!