NTV Telugu Site icon

Air India Express : ఈ మూడు నగరాల నుండి అయోధ్యకు డైరెక్ట్ విమానాలు

New Project 2023 12 30t102922.527

New Project 2023 12 30t102922.527

Air India Express : అయోధ్యకు శనివారం అనగా డిసెంబర్ 30 చాలా ముఖ్యమైన రోజు, ఎందుకంటే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో నిర్మించిన కొత్త విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ను మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభించనున్నారు. అయోధ్యలోని ఈ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్ గా నామకరణం చేశారు. విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముందు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ డిసెంబర్ 29, శుక్రవారం దేశంలోని మూడు నగరాల నుండి అయోధ్యకు నేరుగా విమానాలను నడపనున్నట్లు ప్రకటించింది. జనవరి 17, 2024 నుండి బెంగళూరు- కోల్‌కతా మధ్య అయోధ్యకు నేరుగా విమానాలు నడపనున్నట్లు విమానయాన సంస్థలు తెలిపాయి. ఇది కాకుండా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ జనవరి 30 నుండి ఢిల్లీ – అయోధ్య మధ్య డైరెక్ట్ విమానాలను నడపనుంది.

బెంగళూరు – అయోధ్య మధ్య ఫ్లైట్ టైమ్ గురించి చెప్పుకుంటే.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ జనవరి 17 న ఉదయం 8.05 గంటలకు మొదటి విమానం నడుస్తుంది. ఇది ఉదయం 10.35 గంటలకు అయోధ్యకు చేరుకుంటుందని తెలిపింది. అయితే విమానం అయోధ్య నుంచి రోజుకు 3.40 నిమిషాలకు బయలుదేరి 6.10 నిమిషాలకు బెంగళూరు చేరుకుంటుంది. అయోధ్య నుంచి తొలి విమానం జనవరి 17న ఉదయం 11.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.50 గంటలకు కోల్‌కతా చేరుకుంటుంది. అయితే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కోల్‌కతా నుండి రోజూ 1.25 నిమిషాలకు బయలుదేరుతుంది.. 3.10 నిమిషాలకు అయోధ్య చేరుకుంటుంది.

Read Also:TS 6 Guarantees: ప్రజాపాలనకు పోటెత్తిన దరఖాస్తులు.. రెండోరోజుల్లో 8.12 లక్షలు

ఫ్లైట్ బుకింగ్ ప్రారంభం
ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్గ్ మాట్లాడుతూ – దేశంలోని ప్రతి ప్రాంతానికి విమాన సేవలను అందించడానికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది. ఇందుకోసం పగలు, రాత్రి నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. అయోధ్యకు విమానాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, దేశంలోని మూడు ప్రధాన నగరాలు అంటే ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు నుండి నేరుగా విమానాలను నడపాలని నిర్ణయించుకున్నామన్నారు.

ఇండిగో ఇప్పటికే ప్రకటించింది
ఈరోజు డిసెంబర్ 30న ప్రధాని మోడీ అయోధ్య విమానాశ్రయాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఇండిగో తొలి విమానం టేకాఫ్ కానుంది. అయితే, వాణిజ్య విమాన కార్యకలాపాలు జనవరి 6, 2024 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ స్పష్టం చేసింది. ఇండిగో జనవరి 11, 2024 నుండి అహ్మదాబాద్ – అయోధ్య మధ్య విమాన సర్వీసులను ప్రారంభించనుంది.

Read Also:Nitish Kumar : ఎన్టీయే నుంచి వైదొలగనున్న నితీశ్ కుమార్.. ప్రధాని అభ్యర్థి ఆయనే ?

Show comments