Air India Express : ఈ మూడు నగరాల నుండి అయోధ్యకు డైరెక్ట్ విమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Express : అయోధ్యకు శనివారం అనగా డిసెంబర్ 30 చాలా ముఖ్యమైన రోజు, ఎందుకంటే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో నిర్మించిన కొత్త విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ను మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభించనున్నారు. అయోధ్యలోని ఈ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్ గా నామకరణం చేశారు. విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముందు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ డిసెంబర్ 29, శుక్రవారం దేశంలోని మూడు నగరాల నుండి అయోధ్యకు నేరుగా విమానాలను నడపనున్నట్లు ప్రకటించింది. జనవరి 17, 2024 నుండి బెంగళూరు- కోల్‌కతా మధ్య అయోధ్యకు నేరుగా విమానాలు నడపనున్నట్లు విమానయాన సంస్థలు తెలిపాయి. ఇది కాకుండా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ జనవరి 30 నుండి ఢిల్లీ – అయోధ్య మధ్య డైరెక్ట్ విమానాలను నడపనుంది.
బెంగళూరు – అయోధ్య మధ్య ఫ్లైట్ టైమ్ గురించి చెప్పుకుంటే.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ జనవరి 17 న ఉదయం 8.05 గంటలకు మొదటి విమానం నడుస్తుంది. ఇది ఉదయం 10.35 గంటలకు అయోధ్యకు చేరుకుంటుందని తెలిపింది. అయితే విమానం అయోధ్య నుంచి రోజుకు 3.40 నిమిషాలకు బయలుదేరి 6.10 నిమిషాలకు బెంగళూరు చేరుకుంటుంది. అయోధ్య నుంచి తొలి విమానం జనవరి 17న ఉదయం 11.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.50 గంటలకు కోల్‌కతా చేరుకుంటుంది. అయితే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కోల్‌కతా నుండి రోజూ 1.25 నిమిషాలకు బయలుదేరుతుంది.. 3.10 నిమిషాలకు అయోధ్య చేరుకుంటుంది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Read Also:TS 6 Guarantees: ప్రజాపాలనకు పోటెత్తిన దరఖాస్తులు.. రెండోరోజుల్లో 8.12 లక్షలు
ఫ్లైట్ బుకింగ్ ప్రారంభం
ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్గ్ మాట్లాడుతూ – దేశంలోని ప్రతి ప్రాంతానికి విమాన సేవలను అందించడానికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది. ఇందుకోసం పగలు, రాత్రి నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. అయోధ్యకు విమానాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, దేశంలోని మూడు ప్రధాన నగరాలు అంటే ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు నుండి నేరుగా విమానాలను నడపాలని నిర్ణయించుకున్నామన్నారు.
ఇండిగో ఇప్పటికే ప్రకటించింది
ఈరోజు డిసెంబర్ 30న ప్రధాని మోడీ అయోధ్య విమానాశ్రయాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఇండిగో తొలి విమానం టేకాఫ్ కానుంది. అయితే, వాణిజ్య విమాన కార్యకలాపాలు జనవరి 6, 2024 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ స్పష్టం చేసింది. ఇండిగో జనవరి 11, 2024 నుండి అహ్మదాబాద్ – అయోధ్య మధ్య విమాన సర్వీసులను ప్రారంభించనుంది.
Read Also:Nitish Kumar : ఎన్టీయే నుంచి వైదొలగనున్న నితీశ్ కుమార్.. ప్రధాని అభ్యర్థి ఆయనే ?
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..