Vande Bharat Express: భారతీయ రైల్వేలకు వందే భారత్ రాక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. స్వదేశీ వందే భారత్ రైలు.. రైల్వే ప్రయాణ అనుభవాన్ని ఆధునికంగా, సౌకర్యవంతంగా మారుస్తోంది. వందే భారత్ ప్రభావం చాలా విస్తృతంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కొత్త రైలు వల్ల చాలా నగరాల్లో విమాన ఛార్జీలు దెబ్బతింటాయని, విమానంలో ప్రయాణించే ఛార్జీలు తగ్గుతున్నాయని ఓ అధ్యయనం చెబుతోంది. వందే భారత్ రైలుకు సంబంధించిన డేటా ఫలితాలను పరిశీలిస్తే ఈ రైలును అనేక మార్గాల్లో ప్రవేశపెట్టిన తర్వాత, విమాన ఛార్జీలలో క్షీణత కనిపించిందని స్పష్టమైంది. చెన్నై-బెంగళూరు, తిరువనంతపురం-కాసరగోడ్, ముంబై-పూణె, జామ్‌నగర్-అహ్మదాబాద్, ఢిల్లీ-జైపూర్ మార్గాలను ఉదాహరణగా ఓ నివేదిక పేర్కొంది. ఏప్రిల్ 2023తో పోల్చితే ఈ నగరాల మధ్య విమాన టిక్కెట్ల ధరలు 20 నుంచి 30 శాతం వరకు తగ్గాయని పేర్కొంది.
Read Also:Telangana BJP: నేడే టీ.బీజేపీ తొలి జాబితా… 65 స్థానాలకు అభ్యర్థుల పేర్లు..?
విమాన ఛార్జీలు ఇలా నిర్ణయిస్తారు
వాస్తవానికి, విమాన టిక్కెట్ల రేట్లు డైనమిక్‌గా నిర్ణయించబడతాయి. డైనమిక్ ప్రైసింగ్ అంటే ఏదైనా రూట్ టిక్కెట్ల కోసం డిమాండ్, ఎంక్వైరీ పెరిగితే.. ఆ రూట్‌లో ఛార్జీ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. డిమాండ్ లేదా ఎంక్వైరీ తగ్గినప్పుడు, ఛార్జీలు తగ్గుతాయి. ప్రస్తుతం అధ్యయనంలో ఛార్జీలు తగ్గినట్లు చెప్పబడిన అన్ని మార్గాల్లో వందే భారత్ రైళ్ల కార్యకలాపాలు గత కొన్ని నెలల్లోనే ప్రారంభమయ్యాయి. ఈ రైళ్ల కారణంగా ఇప్పుడు చాలా మంది ప్రజలు విమానంలో ప్రయాణించకుండా రైల్వేలో ప్రయాణించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. గతంలో విమానాల్లో ప్రయాణించే వారిలో ప్రస్తుతం 10 నుండి 20 శాతం మంది ఇప్పుడు వందే భారత్ ట్రైన్లో ప్రయాణిస్తున్నారు.
Read Also:Rahul Gandhi: కొండగట్టు సందర్శన వాయిదా.. నేరుగా ఆర్ముర్ కి రాహుల్..
విమాన ఛార్జీల తగ్గింప ఏ విధంగా ఉందో ఓ ఉదాహరణ ద్వారా చూద్దాం. మీరు ఢిల్లీ-జైపూర్ విమానాన్ని చూడవచ్చు. ప్రస్తుతం, ఈ రెండు నగరాల మధ్య విమాన ఛార్జీలు సుమారు రూ. 2000 నుండి మొదలవుతుండగా, విమానంలో ప్రయాణానికి గంట సమయం పడుతుంది. ఇది కాకుండా, ప్రయాణికులు విమానం ఎక్కడానికి 2 గంటల ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలి. డిబోర్డ్ చేయడానికి కూడా గంట లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. ఈ విధంగా చూస్తే మొత్తం సమయం 4 గంటల కంటే ఎక్కువ అవుతుంది. వందే భారత్ రైలు ఈ ప్రయాణాన్ని రూ. 800. దాదాపు 5 గంటలలో ప్రయాణం ముగుస్తుంది. అంటే దాదాపు అదే సమయం. కానీ సగం కంటే ఖర్చు తక్కువ అవుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రయాణీకులు రైలు ఎంచుకోవడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు.