Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Aimim Humayun Kabir Alliance West Bengal Elections Tmc Muslim Vote Bank

Bengal Election: బెంగాల్ రాజకీయ కురుక్షేత్రంలో కొత్త పొత్తు.. దీదీ తృణమూల్ కోటలకు బీటలు వారుతాయా?

Published Date :March 23, 2026 , 9:17 pm
By Shiva Ganesh
Bengal Election: బెంగాల్ రాజకీయ కురుక్షేత్రంలో కొత్త పొత్తు.. దీదీ తృణమూల్ కోటలకు బీటలు వారుతాయా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bengal Election: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో సరికొత్త సమీకరణం తెరపైకి వచ్చింది. అసదుద్దీన్ ఒవైసీకి చెందిన AIMIM, హుమాయూన్ కబీర్ నేతృత్వంలోని ‘జనతా ఉన్నయన్ పార్టీ’ చేతులు కలపడం ఇప్పుడు బెంగాల్‌ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా మాల్డా, ముర్షిదాబాద్, బీర్బూమ్ వంటి ముస్లిం ప్రాబల్యం ఉన్న జిల్లాలపై ఈ కూటమి కన్నేసింది. ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న ఈ జిల్లాల్లో కూటమి ప్రభావం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు బెంగాల్ రాజకీయ కురుక్షేత్రంలో ఆసక్తికరంగా మారింది.

READ ALSO: BCCI: కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. నిజామాబాద్‌లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు..

బీహార్ ఫార్ములాతో బెంగాల్ బరిలోకి..
గత బీహార్ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో పోటీ చేసి 5 సీట్లు గెలుచుకున్న వ్యూహాన్నే బెంగాల్‌లోనూ అమలు చేయాలని ఒవైసీ భావిస్తున్నారు. హుమాయూన్ కబీర్ ఈ కూటమిలో భాగంగా 50 సీట్లు ఆశించినప్పటికీ, పార్టీ మాత్రం పరిమిత స్థానాల్లోనే పోటీ చేసి మెరుగైన ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా AIMIM ముర్షిదాబాద్, మాల్డా, బీర్బూమ్ జిల్లాల్లోని స్థానాలను టార్గెట్‌గా చేసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి 25న అసదుద్దీన్ ఒవైసీ కోల్‌కతాకు చేరుకోనున్నారు. ఈ మూడు జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

గ్రౌండ్ రిపోర్ట్ ఏ చెబుతోందంటే..
మాల్డా, ముర్షిదాబాద్ జిల్లాల్లో AIMIM గత కొన్నాళ్లుగా క్షేత్రస్థాయిలో పటిష్టమైన పునాదిని నిర్మించుకుంది. హుమాయూన్ కబీర్ మద్దతు తోడైతే, ఈ జిల్లాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఓట్లకు గండి పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, కబీర్ పార్టీ ‘జనతా ఉన్నయన్ పార్టీ’ చాలా కొత్తది కావడం, కేవలం బెల్దంగా, రెజినగర్ ప్రాంతాలకే ఆయన ప్రభావం పరిమితం కావడం కొంత మైనస్ కావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ కూటమి వల్ల ముస్లిం ఓట్లు చీలితే అది నేరుగా మమతా బెనర్జీకి నష్టం చేకూరుస్తుందనే వాదన వినిపిస్తోంది. అయితే తృణమూల్ నేతలు దీనిని కొట్టిపారేస్తున్నారు.

గత ఎన్నికల లెక్కల (2021) లెక్కలను ఒకసారి పరిశీలిస్తే.. ముర్షిదాబాద్‌లో 22 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో TMC 20, బీజేపీ 2 గెలుచుకుంది. మాల్డా పరిధిలో 12 స్థానాలు స్థానాలు ఉంటే TMC 8, బీజేపీ 4 కైవసం చేసుకుంది. గతంలో టీఎంసీ దాదాపు క్లీన్ స్వీప్ చేసిన ఈ జిల్లాల్లో ఒవైసీ ఎంట్రీతో ముక్కోణపు పోటీ నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హుమాయూన్ కబీర్ – ఒవైసీ జోడి దీదీ ఓటు బ్యాంకులో ఎంతవరకు చీలిక తెస్తారో వేచి చూడాల్సిందే అంటున్నారు.

READ ALSO: Ragi Chapati: షుగర్‌కు చెక్.. బరువు తగ్గడానికి బెస్ట్ మంత్రం.. ఈ స్టైల్‌లో రాగి చపాతీ తింటే ఫలితం పక్కా!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AIMIM Bengal Election Alliance 2026
  • Asaduddin Owaisi Kolkata visit
  • Bengal Assembly Elections 2026 updates
  • Humayun Kabir Janata Unnayan Party
  • Owaisi Bihar formula in Bengal.

తాజావార్తలు

  • Bengal Election: బెంగాల్ రాజకీయ కురుక్షేత్రంలో కొత్త పొత్తు.. దీదీ తృణమూల్ కోటలకు బీటలు వారుతాయా?

  • BCCI: కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. నిజామాబాద్‌లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు..

  • Iran-Israel: యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటన.. ఇంకోవైపు ట్రెహాన్‌పై ఇజ్రాయెల్ దాడులు

  • Telangana Cabinet: కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ క్యాబినెట్.. వారి కోసం సంక్షేమ నిధి..

  • Gopichand : విశాఖ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నటుడు గోపీచంద్.. అక్కడి పనితీరు చూసి షాక్.!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions