AIMIM in Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 కోసం ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థుల ప్రకటన జోరందుకుంది. ఇందులో భాగంగా.. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఆదివారం తమ 25 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీహార్‌లోని ప్రజల గొంతుకగా మారతామని ఆశిస్తున్నాం.. అంటూ ఏఐఎంఐఎం ఈ జాబితాను ‘X’ వేదికగా పంచుకుంది. ఈ జాబితాలో సివాన్ నుంచి మహ్మద్ కైఫ్, గోపాల్‌గంజ్ ఏసీ నుంచి అనాస్ సలామ్, కిషన్‌గంజ్ నుంచి అడ్వకేట్ షమ్స్ ఆగాజ్, మధుబని నుంచి రషీద్ ఖలీల్ అన్సారీ, అరారియా నుంచి మొహమ్మద్ మంజూర్ ఆలం వంటి 25 మంది పేర్లు ఉన్నాయి.
Mitchell Starc: రోహిత్‌కు స్టార్క్ బౌలింగ్.. 176.5 కిమీ స్పీడ్ ఏంటి సామీ?
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం తమ అభ్యర్థుల జాబితాలను దశలవారీగా విడుదల చేస్తోంది. శనివారం నాడు కాంగ్రెస్ తమ రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో నర్కటియాగంజ్, కిషన్‌గంజ్, కస్బా, పూర్నియా, గయా టౌన్ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. నర్కటియాగంజ్ నుంచి శాశ్వత్ కేదార్ పాండే, కిషన్‌గంజ్ నుంచి కమ్రూల్ హోడా పోటీ చేయనున్నారు. అలాగే, కస్బా నుంచి ఇర్ఫాన్ ఆలం, పూర్నియా నుంచి జితేందర్ యాదవ్, గయా టౌన్ నియోజకవర్గం నుంచి మోహన్ శ్రీవాస్తవ బరిలో దిగనున్నారు. అంతకుముందు అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ తమ మొదటి జాబితాలో మొత్తం 48 మంది అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో 24 మంది మొదటి దశ ఎన్నికల్లో, మిగిలిన 24 మంది రెండో దశ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
Shocking News: కొండపై నుంచి దూకి బాలికల ఆత్మహత్యాయత్నం..
బీహార్ ఎన్నికలలో నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ సారథ్యంలోని ఇండియా కూటమి ప్రధానంగా తలపడనున్నాయి. అయితే నామినేషన్ ప్రక్రియ ముగిసేనాటికి కూడా ఆర్‌జేడీ, కాంగ్రెస్ భాగస్వాములుగా ఉన్న మహాకూటమి మొదటి దశకు సీట్ల పంపకాన్ని ఖరారు చేయలేకపోయింది. ఫలితంగా కొన్ని సీట్లలో స్నేహపూర్వక పోరు జరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్, అతని పార్టీ జన్ సూరాజ్ రూపంలో కొత్త పార్టీ కూడా రంగ ప్రవేశం చేయనుంది.
बिहार विधानसभा चुनाव के AIMIM प्रत्याशियों के नाम कुछ इस तरह हैं। इंशाअल्लाह उम्मीद है कि हम बिहार के सबसे मज़लूम लोगों की आवाज़ बनेंगे। यह सूची AIMIM बिहार यूनिट ने तैयार की है और इस सिलसिले में पार्टी की क़ौमी कियादत से भी मशविरा किया गया है।
We are happy to announce the list… pic.twitter.com/9ec1t4KpR2
— AIMIM (@aimim_national) October 19, 2025