AICC Observers: మధ్యప్రదేశ్, హర్యానా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల ఎంపికకు తెలుగు రాష్ట్రాల నుంచి ఏఐసిసి పరిశీలకులు..!
AICC Observers: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను దేశవ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో జిల్లా అధ్యక్షుల ఎంపిక కోసం పరిశీలకులను నియమించింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు నేతలకు ఏఐసిసి పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ నేత, సిడబ్ల్యూసి (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) సభ్యుడు గిడుగు రుద్రరాజు, ఏఐసిసి సెక్రటరీ సిరివెళ్ళ ప్రసాద్ మధ్యప్రదేశ్ పరిశీలకులుగా నియమితులయ్యారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
అలాగే తెలంగాణ నుంచి ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ మధ్యప్రదేశ్‌కు పరిశీలకుడిగా ఎంపికవ్వగా, యువ నాయకుడు వంశీ చంద్ రెడ్డి హర్యానా పరిశీలకుడిగా నియమితులయ్యారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల “సంఘటన్ శ్రీజన్ అభియాన్” పేరిట జిల్లాలో పార్టీ పటిష్టతను పెంచే లక్ష్యంతో ఈ ప్రక్రియ ప్రారంభించింది. తొలి దశగా గుజరాత్లో ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది. ఇప్పుడు అదే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది.
Read Also: IPL 2025 Top 2 Race: ఆర్సీబీని కాపాడిన సీఎస్కే.. టాప్-2 కోసం ఆ రెండు జట్లు పోటీ!
ఈ ప్రక్రియ ద్వారా పార్టీకి నిజమైన కర్తవ్యనిష్ఠ కలిగిన కార్యకర్తలకు న్యాయం చేయాలని, సమర్థులైన నేతలకు నాయకత్వం కల్పించాలనే సంకల్పంతో ముందుకెళ్తోంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 50 మంది ఏఐసీసీ పరిశీలకులను, హర్యానాలో 21 మంది పరిశీలకులను నియమించగా.. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఉన్నారు. ఇది రెండు రాష్ట్రాల నేతలకూ గౌరవకరమైన బాధ్యతగా చర్చనీయాంశమవుతోంది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో