NTV Telugu Site icon

AI Caught Thiefs: దొంగలను పట్టించిన ఏఐ.. 1.5 కిలోల బంగారం, 2 కిలోల వెండి, రూ. 17 లక్షల నగదు స్వాధీనం

Ai

Ai

AI Caught Thiefs: రాజస్థాన్‌లోని చురులోని రతన్‌గఢ్ ప్రధాన మార్కెట్‌లోని ఘంటాఘర్, ఘర్ కూడలి మధ్య ఉన్న నగల దుకాణంలో వారం క్రితం జరిగిన కోటి రూపాయల విలువైన చోరీ కేసులో, పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కేసును చేధించారు. ఈ విషయమై చూరు ఎస్పీ జై యాదవ్‌ సమాచారం అందించారు. ఏఐ (AI) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముఠాలోని ముగ్గురు నిందితులను పోలీసు బృందం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. చోరీ ఘటనను దొంగలు చాలా చాకచక్యంగా దాచారని ఆయన తెలిపారు. దొంగల అరెస్టుపై సమాచారం ఇస్తూ.. ఘటన సమయంలో నిందితులు ముఖానికి మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు ధరించి చోరీకి పాల్పడ్డారని తెలిపారు. ఇందులో వాహనాల నంబర్లు కూడా నకిలీవి కావడంతో నిందితులను గుర్తించడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. కేసు దర్యాప్తులో 1000 సీసీ కెమెరాలను స్కాన్ చేసినట్లు ఎస్పీ జై యాదవ్ తెలిపారు.

Also Read: Training For MLAs And MLCs: రెండు రోజులపాటు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు

నిందితుల ముఖానికి మాస్క్‌లు, గ్లౌజులు ఉండడంతో కొత్త ఏఐ టెక్నాలజీ సాయంతో ముఖాలు, అనుమానితులను గుర్తించామని ఎస్పీ జై యాదవ్ తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో కారు నంబర్లు అస్పష్టంగా కనిపించాయి. నంబర్ల సరైన గుర్తింపు కోసం CCTV ఫుటేజ్ వీడియోలు ATS, SOGకి పంపబడ్డాయని, అయితే వారు గుర్తించడంలో విజయవంతం కాలేదని అన్నారు. కాబట్టి, కారు నంబర్‌లను గుర్తించడానికి AI సాంకేతికత సహాయం తీసుకోబడిందని తెలిపారు.

Also Read: Mohan babu: మోహన్‌బాబు సమక్షంలో మీడియా ప్రతినిధులపై బౌన్సర్ల దాడి

పోలీసు అధికారి దిలీప్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన బృందం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారు లొకేషన్‌ను పరిశీలించగా, కారు కూచమన్ నగరంలోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది. వాహనం కూచమాన్‌లోని అషియానా కాలనీలో ఉన్నట్లు సమాచారం అందుకున్నారు. పోలీసులు ఉత్తరప్రదేశ్ వాసులు భగీరథ్ బావ్రీ, అజయ్ సింగ్ బావ్రీ, యాదరామ్ బావ్రీలను అదుపులోకి తీసుకుని విచారించగా.. వారు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. ఈ కేసులో ప్రమేయమున్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు ఎర్టిగా వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Show comments