Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Ahmedabad 550 Crore Hawala Scam Rapido Driver Bank Account Fraud Prevention Tips

Bank Account: బ్యాంక్ ఖాతా అద్దెకిస్తూ.. నెలకు రూ.25 వేల సంపాదన.. వెలుగులోకి కొత్త స్కామ్..

Published Date :March 4, 2026 , 5:58 pm
By Burugadda Veerababu
  • అహ్మదాబాద్‌లో రాపిడో డ్రైవర్ ఖాతాలో రూ.300 కోట్లు..
  • బయట పడిన హవాలా స్కామ్..
  • సైబర్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు
Bank Account: బ్యాంక్ ఖాతా అద్దెకిస్తూ.. నెలకు రూ.25 వేల సంపాదన.. వెలుగులోకి కొత్త స్కామ్..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.550 కోట్ల భారీ హవాలా కుంభకోణం వెలుగులోకి రావడంతో దర్యాప్తు సంస్థలు విస్తుపోతున్నాయి. కేవలం రూ.10 వేల నుంచి రూ.12 వేల నెలసరి ఆదాయం కలిగిన ఒక సామాన్య రాపిడో డ్రైవర్ ఖాతాలో ఏకంగా రూ.300 కోట్లు చేతులు మారడం చూస్తుంటే.. మోసగాళ్లు సామాన్యులను ఏ స్థాయిలో పావులుగా వాడుకుంటున్నారో అర్థమవుతోంది. అసలు ఏం జరిగిందంటే..

అహ్మదాబాద్‌కు చెందిన ప్రదీప్ అనే వ్యక్తి రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అతనికి కిరణ్ అనే వ్యక్తి పరిచయమై.. ఒక ప్రతిపాదన చేశాడు. ‘నీ బ్యాంకు ఖాతాను వాడుకోవడానికి ఇస్తే.. ప్రతి నెలా నీకు రూ.25,000 అద్దె చెల్లిస్తానని ఆశ చూపాడు. కష్టపడకుండా వచ్చే డబ్బు కదా అని ప్రదీప్ తన బ్యాంక్ పాస్‌బుక్, చెక్ బుక్, ఏటీఎం కార్డులను కిరణ్‌కు అప్పగించాడు. అయితే.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు జరిపిన సోదాల్లో ప్రదీప్ ఖాతా ద్వారా అక్రమంగా క్రికెట్ బెట్టింగ్, నకిలీ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల సొమ్మును విదేశాలకు మళ్లించినట్లు గుర్తించారు. కేవలం ఒక డ్రైవర్ ఖాతా నుంచే రూ.300 కోట్లు, మొత్తం ముఠా ద్వారా రూ.550 కోట్లు చేతులు మారాయని దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ప్రదీప్ పోలీసుల అదుపులో ఉండగా.. అసలైన సూత్రధారుల కోసం గాలింపు జరుగుతోంది.

Also Read

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
Add as a preferred
source on google

Read Also:Dwcra Group: మహిళా సంఘాల సభ్యులకు రూ.10 లక్షల బీమా.. ప్రభుత్వం కీలక ప్రకటన..

ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని రకరకాల మార్గాల్లో దోచుకుంటున్నారు. ప్రదీప్ విషయంలో జరిగినట్లుగానే.. విద్యార్థుల బ్యాంకు ఖాతాలను కొంత మొత్తానికి అద్దెకు తీసుకుంటారు. ఆ ఖాతాల ద్వారా నేరగాళ్లు దొంగిలించిన డబ్బును మళ్లించి.. పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటారు. చివరకు ఖాతా కలిగిన అమాయక విద్యార్థులు, డ్రైవర్లు, రోజు వారి కూలీలు జైలు పాలవుతున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి.. నకిలీ యాప్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టిస్తారు. స్క్రీన్‌పై లాభాలు కనిపిస్తాయి కానీ.. విత్‌డ్రా చేసుకునే సమయానికి మీ ఖాతాను బ్లాక్ చేస్తారు.

పోలీసులమని లేదా సీబీఐ అధికారులమని వీడియో కాల్ చేసి.. మీ పేరు మీద డ్రగ్స్ పార్శిల్ వచ్చిందని భయపెట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోలకు లైక్స్ కొట్టడం లేదా హోటల్స్ రేటింగ్స్ ఇవ్వడం ద్వారా రోజుకు వేల రూపాయలు సంపాదించవచ్చని ఆశ చూపుతారు. మొదట చిన్న మొత్తంలో డబ్బు ఇచ్చి నమ్మించి, ఆ తర్వాత భారీగా ఇన్వెస్ట్ చేయించి ముంచేస్తారు. ఈ ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

Read Also:Annaram Barrage : అన్నారం బ్యారేజీకి ముప్పు పొంచి ఉందా..?

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మీ బ్యాంక్ ఖాతా, ఏటీఎం పిన్, ఓటిపి (OTP) లేదా చెక్ బుక్ ఎవరికీ ఇవ్వకండి. మీ ఖాతా ద్వారా జరిగే ప్రతి రూపాయి లావాదేవీకి మీరే బాధ్యులనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అతి తక్కువ కాలంలో డబ్బు రెట్టింపు అవుతుందన్నా లేదా లాటరీ వచ్చిందన్నా అది ఖచ్చితంగా మోసమే అని గుర్తించండి. సోషల్ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తులకు మీ వ్యక్తిగత సమాచారాన్ని గానీ.. ఆర్థిక వివరాలను గానీ పంచుకోక పోవడమే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.

ఈ ఘటనలో.. కేవలం రూ.25 వేల కోసం ఆశపడిన ప్రదీప్ ఇప్పుడు వందల కోట్ల స్కామ్‌లో ఇరుక్కుపోయాడు. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో మనం చేసే చిన్న పొరపాటు జీవితకాలపు కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేస్తుంది. నేరగాళ్ల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక వేళ మీరు సైబర్ మోసానికి గురైతే వెంటనే ‘1930’ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 1930 Cyber Helpline
  • Ahmedabad Hawala Scam
  • cyber crime india
  • cyber safety tips
  • Digital Arrest Fraud

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions