Site icon NTV Telugu

Telangana Police Recruitment: చివరి దశలో తెరమీదకి ఏజ్ రిలాక్సేషన్ వివాదం.. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కీలక ప్రకటన..!

Tsplrb

Tsplrb

Telangana Police Recruitment: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. అభ్యర్థులకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కు సంబంధించి పూర్తయినట్లు తెలిపింది. మరోవైపు అభ్యర్థుల వయసు సడలింపు వివాదం చివరి దశలో తెరమీదికి వచ్చింది. అయితే దరఖాస్తు చేసుకునే ముందు ఎలిజబులిటీ ప్రకారమే చేసుకోవాలంటూ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ ఇచ్చింది.

Read Also: Pregnancy Tips : గర్భిణీలకు కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యాల్సిందే..

వివిధ పోస్టులకు ఇప్పటికే వయసు నిబంధన వెరీఫై అయినట్లు బోర్డు తెలిపింది. అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో వయసు నిబంధనతో పలువురు అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. వయసు నిబంధన పై నోటిఫికేషన్ లో పేర్కొన్న విధానాన్ని అనుసరిస్తామని రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది. అన్ని టెస్టులు క్వాలిఫై అయినా వయసు కారణంగా పలువురు అభ్యర్థులను తిరస్కరించినట్లు బోర్డ్ పేర్కొంది.

Read Also: EMI Kidnap: EMI కట్టలేదని.. కస్టమర్ కూతురి కిడ్నాప్

మరోవైపు ఎలాంటి పుకార్లను నమ్మొద్దని రిక్రూట్మెంట్ బోర్డ్ స్పష్టం చేసింది. అంతేకాకుండా రిక్రూట్మెంట్ బోర్డ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న అభ్యర్థుల వివరాలు చెబితే మూడు లక్షల రివార్డు ఇస్తామని రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావు ప్రకటించారు.

Exit mobile version