Taiwan China: చైనా దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ కీలక ప్రకటన చేశారు. ఏదో ఒక రోజు తైవాన్ చైనాలో కలిసిపోతుందని.. అందులో సందేహం అక్కర్లేదన్నారు. ఆదివారం జరిగిన కీలక సమావేశంలో జిన్ పింగ్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. ఇప్పటికే అన్నింటినీ చేర్చుకున్నామని, ఇక మిగిలింది తైవాన్ ఒక్కటేనని స్పష్టం చేశారు. తైవాన్ పై బలప్రయోగాన్ని ఎప్పటికీ వదులుకోబోమని కరాఖండిగా చెప్పారు. ఈ వ్యాఖ్యలపై తైవాన్ తీవ్రంగా స్పందించింది. తన సార్వభౌమాధికారం, స్వేచ్ఛపై రాజీపడే ప్రసక్తే లేదని వెనక్కి తగ్గమంటూ తెగేసి చెప్పింది. ఈ మేరకు తైవాన్ అధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రెండు దేశాల మధ్య శాంతిని కాపాడుకోవడం ఇరు పక్షాల బాధ్యత అని చెప్పింది. యుద్ధం మంచిది కాదంటూ హితవు పలికింది. తైవాన్ దేశంలో 23మిలియన్ల మంది ప్రజలు జీవిస్తున్నారని వారి భవిష్యత్ నిర్ణయించుకునే హక్కు వారికే ఉందన్నారు. బీజింగ్ ఏకపక్ష నిర్ణయాన్ని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేదని నొక్కి చెప్పింది.
Read Also: Hundred Crores Cheque: హుండీలో రూ.100 కోట్ల చెక్కు…. ఆరా తీసిన అధికారులకు షాక్
రాజకీయాలతో దిగ్బంధం చేసి సైనిక బలగాలతో ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకునే కుట్రలను విడిచి పెట్టాలని చైనీస్ కమ్యూనిస్ట్ అధికారులకు తైవాన్ పిలుపునిచ్చింది. వాస్తవానికి 2016లో ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్ వెస్ తొలిసారిగా ఎన్నికైనప్పటి నుంచి చైనాతో ఉన్న సంబంధాలను కట్టడి చేసింది. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తైవాన్ విషయంలో విదేవీ శక్తులు జోక్యం చేసుకుంటున్నయని.. తైవాన్ను స్వతంత్ర్య దేశంలా ఉంచే క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పుతున్నారంటూ ఆరోపణలు చేశారు. శాంతిని సుస్థిరం చేసేందుకు ప్రయత్నిస్తాం కానీ యుద్ధం చేయమని హామీ ఇవ్వం అని చెప్పారు.