Site icon NTV Telugu

Team India: న్యూజిలాండ్ మ్యాచ్ తర్వాత భారత్ ఆటగాళ్లకు సెలవు.. ఇంటికి వెళ్ళాల్సిందే..!

Team India

Team India

Team India: న్యూజిలాండ్ మ్యాచ్ తర్వాత టీమిండియా ఆటగాళ్లకు సెలవులు లభించనున్నాయి. బిజీ షెడ్యూల్ కారణంగా మేనేజ్‌మెంట్ కొద్ది రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. అక్టోబర్ 22న న్యూజిలాండ్‌తో మ్యాన్ అనంతరం వారికి ఏడు రోజుల పాటు విశ్రాంతి దొరకనుంది. ఇంగ్లండ్ తో అక్టోబర్ 29న మ్యాచ్ ఉండటంతో లాంగ్ గ్యాప్ దొరకనుంది.

ఈ 7 రోజుల సమయంలో టీమిండియా ఆటగాళ్లు 2-3 రోజులు వారి ఇళ్లకు వెళ్లవచ్చు లేదా జట్టుతో సమయం గడపవచ్చు. ఆసియా కప్ నుంచి నిరంతరంగా క్రికెట్ ఆడుతున్నందున భారత ఆటగాళ్లు.. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు తమ పనిభారాన్ని నియంత్రించేందుకు కొన్ని రోజుల విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. అయితే అక్టోబర్ 26లోగా ఆటగాళ్లందరూ జట్టులో చేరాల్సి ఉంటుందని, ఆ తర్వాత లక్నోలో ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు సిద్ధమవుతారని తెలిపింది.

ఈ ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. భారత్ తన తొలి నాలుగు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో 8 పాయింట్లు సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక మొదటి స్థానంలో న్యూజిలాండ్ జట్టు తన మొదటి నాలుగు మ్యాచ్‌లలో గెలిచి 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నంబర్-1 స్థానంలో ఉంది. ఈ పరిస్థితిల్లో ఈ రెండు ఇన్-ఫార్మ్ జట్ల మధ్య ఓ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరుగనుంది. గత 20 ఏళ్లలో ఐసీసీ టోర్నీ మ్యాచ్‌ల్లో భారత్ ఒక్కసారి కూడా న్యూజిలాండ్‌ను ఓడించలేదు. చూడాలి మరీ ఈసారైనా కివీస్ జట్టును టీమిండియా ఓడిస్తుందో లేదో.

Exit mobile version