Seven Sixes: ఒకే ఓవర్లో 7 సిక్సర్లు కొట్టిన ఆప్ఘనిస్థాన్ యువ క్రికెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన 21 ఏళ్ల బ్యాట్స్‌మెన్ సెడిఖుల్లా అటల్ ఒకే ఓవర్లో 7 సిక్సర్లు కొట్టి రుతురాజ్ గైక్వాడ్ రికార్డును సమం చేశాడు. బౌలర్ అమీర్ జజాయ్ వేసిన ప్రతి బంతిని సిక్సర్ కొట్టాడు. కాబూల్ ప్రీమియర్ లీగ్ లో షాహీన్ హంటర్స్ మరియు అబాసిన్ డిఫెండర్స్ జట్టు పోటీపడింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన షాహీన్ హంటర్స్.. కేవలం 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన అటల్.. చివరి వరకు క్రీజులో ఉండి.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 118 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే 19వ ఓవర్లో దుమారం రేపాడు.
Brahmanandam: కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్‌ను కలిసిన బ్రహ్మానందం.. ఎందుకంటే?
Also Read
- Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
జజాయ్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి అటల్ సిక్సర్ కొట్టాడు. తర్వాతి బంతిని వైడ్ వేశాడు జజాయ్. ఆ తర్వాత.. 6 బంతులను ఎదుర్కొని.. సిక్సర్ల మోత మోగించాడు. దీంతో జజాయ్ 19వ ఓవర్లో మొత్తం 48 పరుగులు చేశాడు. మరోవైపు ఒకే ఓవర్లో 7 సిక్సర్లు బాది భారత బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ రికార్డును సమం చేశాడు. గైక్వాడ్ గతేడాది విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా 7 సిక్సర్లు కొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు.
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ లో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
19వ ఓవర్ లో షాహీన్ జట్టు స్కోరు 158 ఉండగా.. ఓవర్ అయిపోయేసరికి 206 పరుగులకు చేరింది. ఆ తర్వాత చివరి ఓవర్లో నవేద్ జద్రాన్ 7 పరుగులు ఇచ్చాడు. దీంతో షాహీన్ 213 పరుగులు చేసింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డిఫెండర్లను షాహీన్ హంటర్స్ 18.3 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌట్ చేశారు.
48 runs from 1 over. @Sediq_Atal26 is now in the cricketing history books. Equalled Rituraj Gaikwad's 7 sixes in an over. Poor Amir Zazai, almost escaped a heartache. This 💯 must open the doors of international cricket & leagues for Atal. 🇦🇫 #FutureStar #WorldRecord #SevenSixes pic.twitter.com/Ntt0lkZVUm
— Cricket Afghanistan (@AFG_Sports) July 29, 2023
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!