Site icon NTV Telugu

IND vs AFG: 5 ఏళ్ల తర్వాత భారత పర్యటనకు ఆఫ్గానిస్తాన్‌..!

Ind Vs Afg

Ind Vs Afg

ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన అనంతరం టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆసీస్ తో తలపడేందుకు ఇంగ్లండ్ కు వెళ్ళనుంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత జట్టు వరుస సిరీస్ లతో బిజీబిజీగా గడపనుంది. వన్డే ప్రపంచకప్ సన్నహాకాల్లో భాగంగా బీసీసీఐ పలు స్వదేశీ, విదేశీ సిరీస్ లకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా డబ్య్లూటీసీ ఫైనల్ ముగిసిన టీమిండియా స్వదేశంలో ఆఫ్గాస్తాన్ తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ ఏడాది జూన్ లో ఆఫ్గాన్ జట్టు భారత పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ ఐసీసీ ప్యూటర్ టూర్ ప్రోగ్రామ్ లో భాగంగా జరుగడం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

Read Also : Arvind Kejriwal: ప్రధానికి వెయ్యి కోట్లు ఇచ్చా.. అరెస్టు చేస్తారా?

ఇక ఇదిలా ఉండగా.. ఈ సిరీస్ ను ప్రసారం చేసేందుకు మధ్యంతర మీడియా హక్కుల టెండర్లను బీసీసీఐ ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఎందుకంటే స్టార్ ఇండియాతో మార్చి నెలాఖరులో బీసీసీఐ ఒప్పందం ముగిసింది. ఇక ఇదే విషయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా రియాక్ట్ అయ్యారు. మీడియా హక్కుల టెండర్ షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ( జున్-జూలై )లో విడుదల చేయబడుతుంది. ఆఫ్టాన్ సిరీస్ కు విడిగా టెండర్లను ఆహ్వానించే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ లో జరుగనున్న ఆస్ట్రేలియా సిరీస్ నుంచి పూర్తి స్థాయి బ్రాడ్ క్రాస్టింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని జై షా పేర్కొన్నాడు. ఇక ఆఫ్గానిస్తాన్ చివరగా 2018లో భారత పర్యటనకు వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా ఆఫ్గానిస్తాన్ ఏకైక టెస్టు మ్యాచ్ ఆడింది. కాగా ఆఫ్గానిస్తాన్ కు అదే తొలి టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం.

Read Also : Sangareddy Crime: కుటుంబాన్నే చంపేదుకు స్కెచ్.. బంధువే అంటున్న బాధితులు

Exit mobile version