Afghanistan vs South Africa: ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టు ఆదివారం క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన దక్షిణాఫ్రికాకు.. ఈసారి ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్‌కు దక్షిణాఫ్రికా జట్టు బౌలర్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 169 పరుగులకే కుప్పకూలడంతో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని 33 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సాధించింది. ఆఫ్ఘన్ జట్టుకు ఒక ఎండ్‌లో రెహ్మానుల్లా గుర్బాజ్ (89) పరుగులతో ఆడిన కానీ.. అతనికి ఎదురుగా ఉన్న ఏ బ్యాట్స్‌మెన్ నుండి మద్దతు లభించలేదు. గుర్బాజ్‌తో పాటు మరో ఇద్దరు బ్యాట్స్‌మెన్ కెప్టెన్ షాహిదీ (10), అల్లా గజన్‌ఫర్ (31) మాత్రమే రెండంకెల స్కోరును అందుకోగలిగారు.
Iron Rods In Rail Track: పంజాబ్‌లో తప్పిన ప్రమాదం.. రైలు పట్టాలపై ఇనుప రాడ్‌లు లభ్యం
షార్జా క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మూడో, చివరి వన్డేలో ఆఫ్ఘన్ టీం టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ., ఈసారి ఆఫ్ఘనిస్థాన్ 200 పరుగులకు కూడా చేరుకోలేకపోయింది. అయితే, రెండవ వన్డేలో 300+ పరుగులు చేసింది. ఇక దక్షిణాఫ్రికా బౌలింగ్లో లుంగీ గిడి (2/22), కబా పీటర్ (2/22), ఆండిలే ఫెహ్లుక్వాయో (2/17) లతో రాణించారు. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్రికా జట్టుకు కెప్టెన్ టెంబా బావుమా (22), టోనీ డిజార్జ్ (26) శుభారంభం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నంలో అల్లా గజన్‌ఫర్ బౌలింగ్‌లో కెప్టెన్ బావుమా అవుటయ్యాడు. రీజా హెండ్రిక్స్ మంచి ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. అతను 31 బంతుల్లో కేవలం 1 ఫోర్ సహాయంతో 18 పరుగులు మాత్రమే చేశాడు. ఇక జార్జి 31 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 26 పరుగులు చేశాడు. మొత్తం 80 పరుగుల వద్ద వీరిద్దరూ పెవిలియన్ బాట పట్టారు.
PM Modi: 15 టాప్ టెక్ కంపినీల సీఈవోలతో రౌండ్‌టేబుల్ భేటీ నిర్వహించిన మోడీ!
ఆ తర్వాత ఐడెన్ మార్క్రామ్, ట్రిస్టన్ స్టబ్స్ కలిసి జట్టు కోసం మిగిలిన పనిని పూర్తి చేశారు. మార్క్రామ్ 67 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్టబ్స్ 42 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో అజేయంగా 26 పరుగులు చేసి సహకారం అందించాడు. 89 పరుగులు చేసిన గుర్బాజ్‌ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ప్రకటించగా, ఈ సిరీస్‌లో మొత్తం 194 పరుగులు చేసిన గుర్బాజ్‌ను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా ప్రకటించారు.