NTV Telugu Site icon

AFG vs NZ: అఫ్గాన్‌ మైదానాలే బెటర్.. బీసీసీఐకి అఫ్గానిస్థాన్‌ సెటైర్లు!

Noida Stadium

Noida Stadium

సెప్టెంబర్‌ 9-13 మధ్య అఫ్గానిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య టెస్ట్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అఫ్గానిస్థాన్‌లో క్రికెట్‌ మ్యాచ్‌లను నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో.. ఈ మ్యాచ్‌కు వేదికగా గ్రేటర్‌ నోయిడాలోని షహీద్‌ విజయ్‌ పాథిక్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ స్టేడియాన్ని అఫ్గాన్‌ ఎంచుకుంది. అయితే మ్యాచ్‌ ప్రారంభ సమయానికి మైదానం చిత్తడిగా ఉండటంతో.. టాస్‌ పడకుండానే తొలి రెండు రోజులు ఆట రద్దయింది. ప్రస్తుతం నోయిడాలో వర్షాలు లేకున్నా.. గత వారం కురిసిన వానల కారణంగా స్టేడియంలో ఔట్‌ ఫీల్డ్‌ తడిగా మారింది. ఇక్కడ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టమ్‌ లేకపోవడం, సరైన సిబ్బంది లేని కారణంగా.. ఔట్‌ ఫీల్డ్‌ ఆరక రెండ్రోజులుగా మ్యాచ్‌ జరగగడం లేదు. మూడో రోజూ మ్యాచ్‌ జరిగే పరిస్థితి లేకపోవడంతో ఈ టెస్ట్ రద్దు దిశగా సాగుతోంది.

Also Read: Rohit Sharma: మరో 10 పరుగులే.. అరుదైన రికార్డుపై రోహిత్‌ శర్మ కన్ను! తొలి కెప్టెన్‌గా..

తాజాగా అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రతినిధులు దీనిపై స్పందించారు. ఇందులో బీసీసీఐ తప్పిదం ఏమీ లేదంటూనే.. తాము అడిగిన మైదానాలను రిజెక్ట్‌ చేయడంతో మరో అవకాశం లేక నోయిడాను ఎంచుకున్నామని అఫ్గాన్‌ క్రికెట్‌ అధికారులు అంటున్నారు. ‘మొదటి ఆప్షన్‌గా లక్నో స్టేడియంను, రెండో ఆప్షన్‌గా డెహ్రాడూన్ స్టేడియం అడిగాం. బీసీసీఐ మా విజ్ఞప్తులను తిరస్కరించింది. అక్కడ టీ20 లీగ్‌లు జరుగుతున్నాయని చెప్పింది. ఇక నోయిడా మాత్రమే మాకు అందుబాటులో ఉంది. మాకు మరో ఆప్షన్‌ లేక అంగీకరించాం. నోయిడా కంటే అఫ్గాన్‌లోని మైదానాల్లోనే మంచి వసతులు ఉన్నాయి. మా మౌలిక సదుపాయాలను బాగా మెరుగుపర్చుకున్నాం. నోయిడాలో సరైన వసతులు లేవని మా కెప్టెన్ షాహిది అన్నాడు. ఇప్పుడు అదే నిజమనిపిస్తోంది’ అఫ్గాన్‌ బోర్డు బీసీసీఐపై సెటైర్లు వేసింది.

Show comments