AFG vs NZ: అఫ్గాన్ మైదానాలే బెటర్.. బీసీసీఐకి అఫ్గానిస్థాన్ సెటైర్లు!
- తొలి రెండు రోజులు ఆట రద్దు
- మూడో రోజూ మ్యాచ్ జరిగే పరిస్థితి లేదు
- అఫ్గాన్‌లో మైదానాల్లోనే మంచి వసతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 9-13 మధ్య అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అఫ్గానిస్థాన్‌లో క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో.. ఈ మ్యాచ్‌కు వేదికగా గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియాన్ని అఫ్గాన్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభ సమయానికి మైదానం చిత్తడిగా ఉండటంతో.. టాస్ పడకుండానే తొలి రెండు రోజులు ఆట రద్దయింది. ప్రస్తుతం నోయిడాలో వర్షాలు లేకున్నా.. గత వారం కురిసిన వానల కారణంగా స్టేడియంలో ఔట్ ఫీల్డ్ తడిగా మారింది. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడం, సరైన సిబ్బంది లేని కారణంగా.. ఔట్ ఫీల్డ్ ఆరక రెండ్రోజులుగా మ్యాచ్ జరగగడం లేదు. మూడో రోజూ మ్యాచ్ జరిగే పరిస్థితి లేకపోవడంతో ఈ టెస్ట్ రద్దు దిశగా సాగుతోంది.
Also Read: Rohit Sharma: మరో 10 పరుగులే.. అరుదైన రికార్డుపై రోహిత్ శర్మ కన్ను! తొలి కెప్టెన్‌గా..
Also Read
తాజాగా అఫ్గాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధులు దీనిపై స్పందించారు. ఇందులో బీసీసీఐ తప్పిదం ఏమీ లేదంటూనే.. తాము అడిగిన మైదానాలను రిజెక్ట్ చేయడంతో మరో అవకాశం లేక నోయిడాను ఎంచుకున్నామని అఫ్గాన్ క్రికెట్ అధికారులు అంటున్నారు. ‘మొదటి ఆప్షన్‌గా లక్నో స్టేడియంను, రెండో ఆప్షన్‌గా డెహ్రాడూన్ స్టేడియం అడిగాం. బీసీసీఐ మా విజ్ఞప్తులను తిరస్కరించింది. అక్కడ టీ20 లీగ్‌లు జరుగుతున్నాయని చెప్పింది. ఇక నోయిడా మాత్రమే మాకు అందుబాటులో ఉంది. మాకు మరో ఆప్షన్ లేక అంగీకరించాం. నోయిడా కంటే అఫ్గాన్‌లోని మైదానాల్లోనే మంచి వసతులు ఉన్నాయి. మా మౌలిక సదుపాయాలను బాగా మెరుగుపర్చుకున్నాం. నోయిడాలో సరైన వసతులు లేవని మా కెప్టెన్ షాహిది అన్నాడు. ఇప్పుడు అదే నిజమనిపిస్తోంది’ అఫ్గాన్ బోర్డు బీసీసీఐపై సెటైర్లు వేసింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!