కని, పెంచి పెద్ద చేసిన కన్న తల్లి, దండ్రుల కళ్లముందే బిడ్డలు ప్రాణాలు వదిలితే కన్న పేగు తల్లడిల్లిపోతుంది.. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ బిడ్డ బోసినవ్వులు మర్చిపోలేక నరకాన్ని అనుభవిస్తారు.. ఆ బాధ వర్ణణాతీతం.. తాజాగా అలాంటి హృదయవిధారక ఘటన ఒకటి చోటు చేసుకుంది .. కన్న బిడ్డ మరణంను తట్టుకోలేని ఓ కన్న తండ్రి ఆ కూతురు సమాధి పక్కనే పడుకున్న ఘటన వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. నారాయణపేట రూరల్ – గోపాల్ పేటవీధికి చెందిన లక్ష్మీ ప్రణీత హోలీ వేడుకల్లో ప్రమాదవ శాత్తు మరణించింది.. అక్కడ ఉండే మినీ వాటర్ ట్యాంక్ కూలి మృతి చెందింది. చేతికొచ్చిన కూతురు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోకంలో మునిగిపోయారు.. బంధువుల సమక్షంలో అదే రోజు సాయంత్రం ఆమె మృతదేహానికి పట్టణ శివారులోని శ్మశాన వాటికలో అంత్య క్రియలు నిర్వహించారు.
అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చిన తండ్రి రమేష్ స్నానం చేసిన వెంటనే బయటకు వెళ్లాడు.. అందరు కంగారు పడుతున్నారు.. అతను ఎంతసేపైనా ఇంటికి రాకపోవడంతో రాత్రి 11.30 గంటల సమయంలో వెతుక్కుంటూ వెళ్లారు.. ఎక్కడా కనిపించకపోవడం తో కుటుంబసభ్యులకూడా అనుమానం వచ్చి అమ్మాయిని పూడ్చిన స్థలానికి వెళ్లి చూడగా అక్కడే పడుకొని ఉండటం చూసి బాధపడ్డారు.. అతన్ని సముదాయించి ఇంటికి తీసుకొచ్చారు..