Siddharth-Adithi Rao Hydari: సైలెంట్‌గా పెళ్లిచేసుకున్న అదితి, సిద్ధార్థ్.. ఫోటోస్ వైరల్!
- వివాహ బంధంలోకి అదితి-సిద్ధార్థ్
- జీవితాంతం సోల్మేట్స్గా ఉందాం
- మహాసముద్రం షూటింగ్ సమయంలో పరిచయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adithi Rao Hydari Marries Hero Siddharth: హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఈ జంట పెళ్లిచేసుకుంది. సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్దతిలో సిద్ధార్థ్, అదితి వివాహం జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ స్టార్ కపుల్స్ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తమ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.
పెళ్లి పోటోలను అదితిరావు హైదరీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. నా నక్షత్రాలన్నీ నువ్వే. నవ్వులు, లవ్, మ్యాజిక్‌లతో జీవితాంతం సోల్మేట్స్గా ఉందాం. మిసెస్ అండ్ మిస్టర్ అదు సిద్ధు’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం సిద్ధార్థ్, అదితి పెళ్లి ఫోటోస్ సోషల్ మీడియాలోవైరల్ అవుతున్నాయి. నూతన వధూవరులకు అభిమానులు, నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. గత మార్చిలో వనపర్తిలోని ఆలయంలోనే వీరి ఎంగేజ్మెంట్ సీక్రెట్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఎంగేజ్మెంట్ మాదిరే పెళ్లి కూడా చాలా సింపుల్‌గా జరిగినట్లు తెలుస్తోంది. ఈ శుభకార్యం ఆదివారం జరిగిందా? లేదా సోమవారం ఉదయం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
Also Read: Motorola Edge 50 Neo: ఎడ్జ్ 50 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే!
శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంతో అదితిరావు హైదరీ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉండడంతోనే పెళ్లి అక్కడే జరిగింది. ‘మహాసముద్రం’ సినిమా షూటింగ్ సమయంలోనే సిద్ధార్థ్‌తో అదితికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే క్రమంగా ప్రేమగా మారి.. పెళ్లికి దారితీసింది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. ‘సమ్మోహనం’ సినిమాతో అదితి తెలుగు ఇండస్ట్రికి పరిచయం అయ్యారు. వీ, అంతరిక్షం, మహాసముద్రం సినిమాల్లో మెరిశారు. ఇక తెలుగులో బాయ్స్, నువస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి హిట్స్ సిద్ధార్థ్ ఖాతాలో ఉన్నాయి.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!