Motorola Edge 50 Neo Launch and Price in India: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘మోటోరొలా’ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ఎడ్జ్ సిరీస్‌లో తీసుకొచ్చిన ఫోన్లకు లభించిన ఆదరణతో కంపెనీ గత ఆగష్టులో ‘మోటోరొలా ఎడ్జ్ 50’ను ఆవిష్కరించింది. నేడు ‘మోటోరొలా ఎడ్జ్ 50 నియో’ని లాంచ్ చేయనుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కంపెనీ ఈ ఫోన్‌ను రిలీజ్ చేస్తోంది. ఇందుకు సంబందించిన పోస్టర్స్ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్నాయి. ఫోన్ లాంచ్‌కు ముందే కంపెనీ కొన్ని ఫీచర్లను విడుదల చేసింది. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
మోటోరొలా ఎడ్జ్ 50 నియోలో 6.4 ఇంచెస్ సూపర్ హెచ్‌డీ ఎల్‌టీపీఓ అడాప్టివ్ డిస్‌ప్లే ఉంటుంది. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్‌ల బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఐపీ 68 రేటింగ్‌తో వస్తోన్న ఈ మొబైల్‌ను తడిచేతితోనూ వినియోగించే సదుపాయం ఉందని కంపెనీ చెబుతోంది. ఎడ్జ్ 50 నియో ఫోన్ నాటికల్ బ్లూ, లాట్టే, గ్రిసైల్ మరియు పోయిన్సియానా ప్రీమియం వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో వస్తోంది.
Also Read: Gold Rate Today: పెరుగుదలకు నో బ్రేక్.. తులం బంగారంపై నేడు ఎంత పెరిగిందంటే?
మోటోరొలా ఎడ్జ్ 50 నియోలో 50 ఎంపీ సోనీ లిటియా 700సీ సెన్సర్ అల్ట్రాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 10 ఎంపీ టెలిఫొటో షూటర్ ఉన్నాయి. సెల్ఫీ కోసం ముందువైపు 32 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ 68 వాట్స్ టర్బోఛార్జింగ్‌కు, 15 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 5 సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్‌లు, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లతో ఫోన్‌ను తీసుకురానున్నట్లు కంపెనీ ధృవీకరించింది. భారతదేశంలో ఈ ఫోన్ దాదాపు రూ. 46,500గా ఉంటుందని తెలుస్తోంది. భారతదేశంలో మిడ్ ప్రీమియం హ్యాండ్‌సెట్‌గా రానుంది.