Prabhas Adipurush Movie Streaming on Amazon Prime Video Now: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ సినిమా ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాఘవగా, కృతి సనన్ జానకిగా కనిపించగా.. లంకేశ్ పాత్రలో సైఫ్ ఆలీ ఖాన్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో జూన్ 16న రిలీజైన ఆదిపురుష్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఈ ఏడాది నిర్మాతలకు అధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఆదిపురుష్ కూడా ఒకటిగా నిలిచింది.
దాదాపు 500 వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఆదిపురుష్ సినిమా.. 350 కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఆశించిన విజయం అందుకోకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. తెలిసిన కథ, విజువల్ ఎఫెక్ట్స్, పాత్రల లుక్స్ లాంటివి ఈ సినిమాకు మైనస్ అయ్యాయి. ఇక రామాయణాన్ని వక్రీకరించారని, కార్టూన్ సినిమా తీశారని నెటిజన్స్ సహా ప్రముఖులు కూడా ఆదిపురుష్ యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెగెటివ్ టాక్ కారణంగా సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపింది.
అయితే ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రమోషన్స్ లేకుండా ఆదిపురుష్ సినిమా సెలైంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం మిడ్‌నైట్ నుంచి ‘అమెజాన్ ప్రైమ్’లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలు అందుబాటులో ఉండగా.. హిందీ వర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా.. రెంటల్ విధానంలో ఆదిపురుష్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read: Shikhar Dhawan: నా పేరు లేకపోవడంతో షాక్‌కు గురయ్యా: శిఖర్ ధావన్
ఆదిపురుష్ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో చూడాలంటే.. సబ్‌స్క్రిప్షన్ ఉంటే సరిపోదు. అదనంగా రూ. 279 రూపాయలు చెల్లించాలి. అయితే వచ్చే వారం నుంచి ఫ్రీ స్ట్రీమింగ్ ఉండే అవకాశం ఉంది. రిలీజ్‌కు ముందు ఆదిపురుష్ చిత్రంపై నెలకొన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు రూ. 250 కోట్లకు అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుందని సమాచారం. బిగ్ స్క్రీన్‌పై బోల్తా పడ్డ ఈ సినిమా ఓటీటీలోకి ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.