Site icon NTV Telugu

Adipurush Final Trailer: పాపం ఎంత బలమైనది అయినా అంతిమ విజయం సత్యానిదే

Adi Purush

Adi Purush

Adipurush Action Trailer: ప్రభాస్, కృతిసనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ .. నేడు తిరుపతిలో ప్రియ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో ఆదిపురుష్ యాక్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ లో జానకి రాముల విరహవేదనను చూపించగా.. ఈ ట్రైలర్ లో రాముడికి రావణాసురుడికి జరిగిన యుద్దాన్ని చూపించారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. గూస్ బంప్స్ ను తెప్పిస్తుంది. లక్ష్మణ గీత దాటి రావణ బ్రహ్మకు ఆహారం పెట్టిన సీతను ఎత్తుకెళ్ళడంతో మొదలైన ట్రైలర్ రావణాసురుడిపై రాముడు యుద్ధం ప్రకటించి.. అంతమొందించడంతో ముగిసింది.

Adipurush: వైట్ లో రామయ్య.. బ్లాక్ లో సీతమ్మ.. చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదే

” వస్తున్నా రావణ.. న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణిచివేయడానికి.. వస్తున్నా నా జానకిని తీసుకువెళ్ళడానికి.. నా ఆగమనం.. అధర్వ విధ్వంసం” అని రాముడు మాట్లాడిన పవర్ ఫుల్ డైలాగ్స్.. రావణ మూకతో వానర సేన యుద్ధం.. జానకి కోసం హనుమంతుని చేసిన సాయం… ఇలా మొత్తం ట్రైలర్ లో చూపించారు. ముఖ్యంగా రాముడు మాట్లాడిన ప్రతి మాట హైలైట్ గా నిలిచాయి. ” ఈరోజు.. నాకోసం పోరాడొద్దు.. భరతఖండంలో పర స్త్రీ మీద చెయ్యి వెయ్యాలని చూసే దుష్టులకు.. మీ పౌరుష పరాక్రమాలు గుర్తొచ్చి వెన్నులో వణుకుపుట్టాలి.. పోరాడతారా” అనే డైలాగ్స్ కు గూస్ బంప్స్ రావడం ఖాయం. ఇక యుద్ధ సన్నివేశాలు.. మొదటి ట్రైలర్ లో లేనివి కనిపించాయి. ఇక చివర్లో రావణాసురుడు పది తలల శక్తిని తీసుకుంటూ.. ” ఈ దశకంఠుడు పదిమంది రాఘవల కన్నా ఎక్కువ.. ” అని చెప్పడం.. దానికి సమాధానంగా రాముడు.. పాపం ఎంత బలమైనది అయినా అంతిమ విజయం సత్యానిదే అని రాముడు చెప్పడంతో ట్రైలర్ ముగిసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version