Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Adilabad Adilabad Crime News Fake Police Steal Gold Ornaments Form Woman In Bela

Crime News: ఉచిత సలహా ఇచ్చి.. బంగారు ఆభరణాలను అపహరించిన నకిలీ పోలీసులు!

Published Date :April 21, 2025 , 11:11 am
By Sampath Kumar
  • ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో దోపిడీ కలకలం
  • ఉచిత సలహా ఇచ్చి బంగారు ఆభరణాలను అపహరించిన దుండగులు
  • లబోదిబో అంటూ పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తిన బాధితురాలు
Crime News: ఉచిత సలహా ఇచ్చి.. బంగారు ఆభరణాలను అపహరించిన నకిలీ పోలీసులు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో దోపిడీ కలకలం రేపింది. కొందరు దుండగులు పోలీసుల పేరుతో రోడ్డుపై ఇద్దరు దంపతుల బైక్ ఆపి.. ఉచిత సలహా ఇచ్చి బంగారు ఆభరణాలను అపహరించారు. మోసపోయామని తెలుసుకున్న ఆ దంపతులు బేల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

కౌట గ్రామానికి చెందిన సంతోష్, వందనలు తమ ద్విచక్ర వాహనంపై మాంగ్రూడ్ గ్రామం వెళ్లి తిరుగు పయనం అయ్యారు. పాఠన్ సమీపంలో రహదారిపై ఇద్దరు వ్యక్తులు వీరిని ఆపారు. తాము పోలీసులమని, ముందు ఓ హత్య జరిగిందని చెప్పారు. మెడలో బంగారాన్ని తీసి కవర్లో పెట్టుకొని వెళ్లమని సలహా ఇచ్చారు. దుండగులు చెప్పిన మాట విన్న వందన.. తన మెడలో బంగారాన్ని తీసింది. బంగారాన్ని తాము కవర్లో పెట్టి ఇస్తామని దుండగులు చెప్పగా.. వారి చేతికి ఇచ్చింది. గులక రాళ్ల కవర్ వందనకు ఇచ్చి.. బంగారు ఆభరణాలతో దొంగలు పరార్ అయ్యారు.

ఇది గమనించిన సంతోష్, వందన దంపతులు తాము మోసపోయామని గ్రహించారు. లబోదిబో అంటూ బేల పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తారు. రెండు బైక్‌లపై నలుగురు మాటు వేసి.. పోలీసుల పేరుతో మోసం చేశారని బాధితురాలు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంను పోలీసులు పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adilabad
  • Bela Mandal
  • Crime News
  • telangana

తాజావార్తలు

  • South Korea: డేజియోన్ కారు ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 10 మంది మృతి.. 59కి తీవ్రగాయాలు

  • IPL 2026: వాటంన్నింటికీ దూరంగా ఉండు.. వైభవ్ సూర్యవంశీకి కెప్టెన్ మాస్ వార్నింగ్..!

  • Hormuz Strait Crisis: హర్మూజ్ జలసంధిపై అమెరికా కీలక ప్రకటన..

  • Gold Rates: మగువలకు శుభవార్త.. నేడు బంగారం, వెండి ధరలు ఇలా!

  • Singareni Coal Production: సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై యుద్ధ ప్రభావం.. అసలేమైందంటే..?

ట్రెండింగ్‌

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions