సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆది శ్రీనివాస్… ‘కేటీఆర్.. నువ్వెన్ని పెడబొబ్బలు పెట్టినా ఏం ఉపయోగం లేదు. మా ముఖ్యమంత్రి పైన పిచ్చి పిచ్చిగా వాగినంత మాత్రాన నువ్వు పెద్ద మొగోడివి కావు’ అని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నంత కాలం కేటీఆర్, కేసీఆర్ ఇద్దరు కలిసి తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు.
‘మీ బతుకు, నీ అయ్య బతుకు ఏమిటో తెలంగాణ ప్రజలు తేల్చేశారు. అధికారంలో ఉన్న రోజుల్లో సువర్ణపురం దొంగల్లా పాలన చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రగతిభవన్ గడీ కట్టుకున్నారు. మీ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు కరివేపాకులా వాడి పారేశారు. మా ముఖ్యమంత్రి అందరినీ గౌరవంగా చూస్తారు. మీలా గేటు దగ్గర అవమానించి పంపించడం లేదు. వేదికలపై మంత్రులను ఈసడించుకోలేదు, ఈకముక్కలా తీసిపారేయలేదు. దళిత డిప్యూటీ సీఎంను కారణం చెప్పకుండా బర్తరఫ్ చేసిన చరిత్ర కూడా కేసీఆర్‌దే’ అని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
Also Read: Rohit-Kohli: అరరే రో-కో.. అడిలైడ్‌లో సీన్ రివర్స్ అయిందే!
‘అవినీతి సొమ్ములో వాటా అడిగిన సొంత బిడ్డను పార్టీ నుంచి గెంటివేసింది మీ చరిత్ర. పదేళ్ల అధికారంలో నిజాయితీగల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టి రిటైర్డ్ అధికారులతో రాజ్యం నడిపారు. తెలంగాణ పోలీసులు ఏం పీకుతున్నారంటూ వాగుతున్నారు. వెయిట్ చేయి.. అన్ని చూస్తున్నాం. సొంత ఇళ్లు చక్కబెట్టుకోలేని నువ్వు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతావా?. నీ చెల్లెలు అడిగిన ఒక్క ప్రశ్నకైనా ఇప్పటివరకు సమాధానం చెప్పావా?. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ చేస్తున్న రాజకీయ ప్రదర్శనలను ఆపు. నువ్వెంత ఎగిరిపెడ్డా ఉపయోగం లేదు.. నీ మూతి పళ్లే రాలుతాయి చూసుకో’ అంటూ కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
