సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆది శ్రీనివాస్… ‘కేటీఆర్.. నువ్వెన్ని పెడబొబ్బలు పెట్టినా ఏం ఉపయోగం లేదు. మా ముఖ్యమంత్రి పైన పిచ్చి పిచ్చిగా వాగినంత మాత్రాన నువ్వు పెద్ద మొగోడివి కావు’ అని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నంత కాలం కేటీఆర్, కేసీఆర్ ఇద్దరు కలిసి తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. ‘మీ బతుకు, నీ అయ్య బతుకు…