NTV Telugu Site icon

BJP President: బీజేపీ అధ్యక్షుడుగా అడ్డురి శ్రీరామ్ ఏకగ్రీవం.. స్పందించిన పురందేశ్వరి!

Daggubati Purandeswari, Adduri Sriram

Daggubati Purandeswari, Adduri Sriram

ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా అడ్డురి శ్రీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు ధ్రువీకరించారు. అధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా.. పార్టీని బలోపేతం చేయటంలో శ్రీరామ్ పని తీరును పార్టీ గుర్తించింది. అంతేకాదు కార్యకర్తల అభిప్రాయాలను కూడా పార్టీ పెద్దలు పరిగణలోకి తీసుకున్నారు. అడ్డురి శ్రీరామ్ రాబోయే మూడు సంవత్సరాలు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు.

‘బీజేపీ పార్టీ ప్రతి మూడు సంవత్సరాలకు ఓసారి సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకోవటం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా 900 పోలింగ్ బూతులు కమిటీ వేయటం జరిగింది. జిల్లా ఎన్నికల్లో 15 మంది అధ్యక్ష పదవిని అడగటం జరిగింది. చివరకు నలుగురు పోటీ పడ్డారు. అందరి అభిప్రాయం మేరకు జిల్లా అధ్యక్ష పదవిని ఎన్నుకున్నాం. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవికి అడ్డురి శ్రీరామ్ నామినేషన్ ఇచ్చారు. అందరి అభిప్రాయాల మేరకు శ్రీరామ్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది’ అని వేటుకూరి సూర్యనారాయణ రాజు తెలిపారు.

బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ… ‘అడ్డూరి శ్రీరామ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవిలో మూడు సంవత్సరాలు కొనసాగుతారు. కార్యకర్తల అభిప్రాయాలూ తీసుకున్నాం. శ్రీరామ్‌తో పాటు 4 పేర్లు వచ్చాయి. పార్టీని బలోపేతం చేయటంలో శ్రీరామ్ పనితీరు పార్టీ గుర్తించింది. రాబోయే మూడు సంవత్సరాలు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. కార్యకర్తలందరిని శ్రీరామ్ కలుపుకుంటూ వెళ్లాలి. అధ్యక్షుడుని అనే భావన లేకుండా అందరితో కలుపుకుంటూ వెళ్లాలని కోరుకుంటున్నా. ఇంతకుముందు ఇదే బాధ్యతతో శ్రీరామ్ పని చేశారు’ అని అన్నారు.

‘ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ అభివృద్ధి కొరకు నిధులు కేటాయించడం జరుగుతుంది. పోలవరం, విశాఖ ఉక్కు కోసం కేంద్రం నిధులు కేటాయిస్తుంది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్రం సహాయం చేస్తుంది. పంచాయతీ రాజ్, టాక్స్ డెవల్యూషన్ ఇలా అన్ని విధాలుగా కేంద్రం ఏపీకి సహాయ సహకారాలు అందిస్తుంది. విజయవాడ- గుంటూరు మౌలిక సదుపాయల అభివృద్ధికి కేంద్రం సహాయం అందుస్తుంది’ అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. బీజేపీ ఏపీ కొత్త అధ్యకుడిపై చర్చ జరిగింది. పురందేశ్వరినే కొనసాగించాలని సీఎం చంద్రబాబు హోంమంత్రి అమిత్ షాకు రెకమండ్ చేసినట్లు తెలుస్తోంది.