Site icon NTV Telugu

Addanki Dayakar Rao : తెలంగాణలో హిందు దేవతల మీద దూషణ జరుగుతోంది

Addanki Dayakar

Addanki Dayakar

తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ఇటీవల బైరి నరేష్‌ అనే వ్యక్తి హిందు దేవతలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అయితే.. బైరి నరేష్‌ అనే వ్యక్తి మీ పార్టీకి చెందినవాడు అంటే మీకు చెందిన వాడు అంటూ విమర్శలు గుప్పించుకుంటున్నారు నేతలు. ఈ నేపథ్యంలోనే తాజాగా పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో హిందు దేవతల మీద దూషణ జరుగుతోందన్నారు. బాసర సరస్వతి అమ్మవారిపై చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని, అంబేద్కర్ ఎప్పుడు ఇతర మతాలను విమర్శించ వద్దు అన్నారు. రాజ్యాంగంలో లౌకిక తత్వం రూపొందించింది అంబేద్కర్‌ అన్నారు. మొన్న అయ్యప్ప స్వామి…ఇవాళ సరస్వతి దేవి పై కామెంట్స్ ఎందుకు చేస్తున్నారన్నారు. బైరి నరేష్‌తో బండి సంజయ్…ఈటల మీటింగ్ వెనక వ్యూహం ఏంటని ఆయన ప్రశ్నించారు. కమలాపుర్ మీటింగ్ వెనక రహస్యం ఏంటో బయటకు రావాలన్నారు. బీజేపీ ప్రోద్బలంతోనే వివాదాలు అని ఆయన విమర్శించారు.
Also Read :CM Jagan Humanity: మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం జగన్

హిందు మతాన్ని తిడితే గొప్పోళ్ళు అన్నట్టు ఫీల్ అవుతున్నారన్నారు. అంబేద్కర్ హిందు మతంకి వ్యతిరేకి అనే భావన తెస్తున్నారన్నారు. మేము సచ్చినా ఆమోదించమన్నారు. బీజేపీ సూడో హిందువు అన్నారు. రాజకీయం కోసం విద్వాంస..విచ్ఛిన్నకర శక్తిగా బీజేపీ మారిందన్నారు. కాంగ్రెస్ పండిట్ ల కుటుంబం నుండి వచ్చిన పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని మతాల సమానం అనే భావన కాంగ్రెస్ ది అని, ఏ మతం దేవుళ్లను దూషించినా సహించదన్నారు. బీజేపీ అనుకూల వాతావరణం సృష్టించే పనిలో ఉన్నారని, సర్వమత సమానత్వం కాంగ్రెస్ విధానమన్నారు. బండి సంజయ్..ఈటల రాజేందర్ రాజకీయ కుట్ర త్వరలోనే బయట పడతాయన్నారు అద్దంకి దయాకర్‌.

Exit mobile version