NTV Telugu Site icon

Addanki Dayakar Rao : బండి సంజయ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫైర్

Addanki Dayakar

Addanki Dayakar

Addanki Dayakar Rao : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీజేపీ(BJP)పై, కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఘాటు విమర్శలు చేశారు. బండి సంజయ్ ని కేంద్ర మంత్రిగా ఎందుకు చేశారో వారికే తెలియాలని, ఆయనను త్వరగా ఎవరికైనా చూపిస్తే అందరికీ మంచిదని అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు దేశభక్తులు, దేశ ద్రోహులు ఎవరో కూడా తెలియదని విమర్శించారు. ఇలాంటి వారిని ఎంపీలుగా చేసి కేంద్ర ప్రభుత్వం ఎవరిని ఉద్ధరించాలనుకుంటుందో అర్థం కావడం లేదన్నారు. బీజేపీ అధ్యక్ష పదవి కోసమే పోటీ పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆ పదవి ఎవరికో ఒకరికి ఇస్తే వీళ్ళ నోర్లు మూతపడతాయని ఆశిస్తున్నానని అన్నారు.

పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసే క్రెడిబిలిటీ కాంగ్రెస్ దేనని అద్దంకి స్పష్టం చేశారు. దేశం మొత్తం మీద పేదలకు సన్నబియ్యం ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని తెలిపారు. దేశంలో ఆహార భద్రత పథకాన్ని తెచ్చింది కూడా కాంగ్రెస్ ఘనతే అని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇచ్చి అప్పుడు బండి సంజయ్ మాట్లాడాలని సూచించారు. రాష్ట్రానికి ఏవైనా నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడానికి కేంద్రంతో కొట్లాడాలి కాని ఏ పనీ చేయకుండా పేర్ల కోసం కొట్లాడే పంచాయితీ మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రారంభించిన పథకాలకు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ పేర్లను పెట్టే దమ్ము ఉందా అని అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు.

Health Tips: నెల పాటు ప్రతిరోజూ 20 పుష్-అప్‌లతో శరీరంలో అద్భుతమైన మార్పులు..