Supreme Court : అదానీ గ్రూప్ – హిండెన్‌బర్గ్ వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. హిండెన్‌బర్గ్ నివేదిక నుండి ఉత్పన్నమయ్యే సమస్యపై సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఏఎం సప్రే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీలో ఓపీ భట్, నందన్ నీలేకని, కేసీ కామత్, సోమశేఖర్ సుందరం సభ్యులుగా ఉంటారు. సెబీ నిబంధనలలోని సెక్షన్ 19 ఉల్లంఘన జరిగిందా, స్టాక్ ధరలలో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే దానిపై దర్యాప్తు చేయాలని కూడా అపెక్స్ కోర్ట్ సెబీని ఆదేశించింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొనసాగుతున్న విచారణను రెండు నెలల్లో పూర్తి చేసి స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. పెట్టుబడిదారులను రక్షించేందుకు నియంత్రణ యంత్రాంగాలను కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నిబంధనల ఉల్లంఘన జరిగిందా, స్టాక్ ధరల్లో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే దానిపై దర్యాప్తు చేయాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Read Also: Meghalaya Election Counting Updates : ఎగ్జిట్ పోల్స్ ను నిజం చేస్తున్న ప్రస్తుత ఫలితాలు
ఫిబ్రవరి 17న పిఐఎల్‌ల బ్యాచ్‌పై కోర్టు ఉత్తర్వులను రిజర్వు చేసింది. గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపథ్యంలో అదానీ కంపెనీ స్టాక్‌లు క్రాష్ అయిన తర్వాత స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ మెకానిజమ్‌లను పరిశీలించడానికి సభ్యుల పేర్లు, ప్రతిపాదిత కమిటీ పరిధిని సీల్డ్ కవర్‌లో సూచించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఫిబ్రవరి 17న SC తిరస్కరించింది. ఇప్పుడు కమిటీని నియమిస్తామని, దాని సభ్యులను నామినేట్ చేసి.. పనితీరు పరిధిని రూపొందిస్తామని కోర్టు తెలిపింది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావానికి సంబంధించిన PILలపై సుప్రీం కోర్టు తన ఆదేశాలను కూడా రిజర్వ్ చేసింది.
Read Also: Shalu Chourasiya: కేబీఆర్ పార్క్‌లో నటికి వేధింపులు..! మరోసారి వార్తలోకి నటి చౌరాసియా
ఫిబ్రవరి 17న విచారణ ప్రారంభమైనప్పుడు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కమిటీకి సూచించిన పేర్లను, దాని పని పరిధిని సీల్డ్ కవర్‌లో పంపిణీ చేశారు. వాస్తవాలు బయటకు వస్తే అది మార్కెట్ పై ప్రభావితమవుతాయని సొలిసిటర్ జనరల్ కమిటీ పేర్కొంది. కేసు పూర్తి పారదర్శకంగా కొనసాగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అన్నారు. ఫిబ్రవరి 10న, సుప్రీంకోర్టు బెంచ్ జనవరి 24న హిండెన్‌బర్గ్ నివేదికను విడుదల చేసిన తర్వాత మార్కెట్ అస్థిరత నుండి భారతీయ పెట్టుబడిదారులను రక్షించడానికి తీసుకోవలసిన చర్యలను సూచించమని మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాను కోరింది.