Site icon NTV Telugu

Sohani Kumari: నటి కాబోయే భర్త ఆత్మహత్య.. తప్పు చేశానంటూ సెల్ఫీ వీడియో

Sohani Kumari

Sohani Kumari

Sohani Kumari: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ప్రశాసన్‌ నగర్‌లో ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్, బాలీవుడ్ నటి అయిన సోహాని కుమారి కాబోయే భర్త సవాయ్‌ సింగ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన సోహాని కుమారి, సవాయ్‌ సింగ్‌లకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారి, గత జూలైలో ఇరువురికీ నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత వారిద్దరూ జూబ్లీహిల్స్‌ లోని ప్రశాసన్‌ నగర్‌లో అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లో సవాయ్‌ సింగ్‌తో కలిసి ఉంటోంది.

Samantha : ప్రేమ -పెళ్లి తొందరపడ్డ.. సమంత ఎమోషనల్ పోస్ట్

శనివారం ఉదయం సవాయ్ సింగ్ తన కార్యాలయానికి వెళ్లగా.. సాయంత్రం సోహాని ఇంటికి తిరిగి వచ్చింది. తలుపు తెరిచి లోపలికి వెళ్లిన సోహాని డైనింగ్ హాల్‌లో సవాయ్ సింగ్ ఉరి వేసుకుని ఉండటం చూసి పోలీసులకు సమాచారం తెలపడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో సవాయ్‌ సింగ్ ఆత్మహత్య చేసుకునే ముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ వీడియోలో తాను జీవితంలో చాలా తప్పులు చేశానని, వాటివల్ల ఇబ్బందులు పడుతున్నానని, ఇకపై అలాంటి తప్పులు చేయనని చెప్పినట్లు తెలుస్తోంది.

Surya Kumar Yadav: శభాష్.. ఇది కదా దేశభక్తి అంటే.. మ్యాచ్ ఫీజలు మొత్తం?

అయితే పోలీసుల విచారణలో సోహానీతో పరిచయానికి ముందే సవాయ్ సింగ్‌కు మరో యువతితో స్నేహం ఉండేదని.. ఆమెను మర్చిపోలేకపోవడం, ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని సోహాని పోలీసులకు వివరించింది. ప్రస్తుతం పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. అలాగే, సవాయ్ సింగ్ మాజీ స్నేహితురాలిని కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Exit mobile version