Surya Kumar Yadav: శభాష్.. ఇది కదా దేశభక్తి అంటే.. మ్యాచ్ ఫీజలు మొత్తం?
- ఆసియా కప్ గెలిచిన భారత్..
- కానీ ట్రోఫీని నిరాకరణ
- నా నిజమైన ట్రోఫీలు నా సహచరులే - కెప్టెన్ సూర్య.
- మ్యాచ్ ఫీజుల మొత్తాన్ని భారత సైన్యానికి విరాళంగా ప్రకటించిన సూర్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Surya Kumar Yadav: ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన భారత జట్టు తమ తొమ్మిదో ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం తర్వాత జరిగిన ట్రోఫీ ప్రజెంటేషన్ వేడుక అసాధారణ పరిణామాలతో వార్తల్లో నిలిచింది. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. దీంతో ట్రోఫీ లేకుండానే ఛాంపియన్లుగా భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.
Asia Cup 2025: మ్యాచ్ అనంతరం హైడ్రామా.. ట్రోఫీని తీసుకోని భారత్! సంబరాలు మాత్రం హైలెట్
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
భారత్ విజయం సాధించిన తర్వాత ట్రోఫీ, మెడల్స్ ప్రదానం చేసే కార్యక్రమం దాదాపు గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. వ్యక్తిగత అవార్డులను ఇతర అతిథుల నుంచి అందుకున్నప్పటికీ, టీమిండియా మాత్రం మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని తిరస్కరించింది. దుబాయ్ క్రికెట్ బోర్డు వైస్ చైర్మన్ ఖలీద్ అల్ జరూనీ నుంచి ట్రోఫీని తీసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉన్నప్పటికీ, నఖ్వీ అందుకు అంగీకరించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ అపూర్వమైన సంఘటన గురించి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు.
Ind vs Pak : పాక్‌ను చిత్తు చేసిన భారత్.. భారత్‌కు తొమ్మిదోసారి ఆసియాకప్ ట్రోఫీ
సూర్యకుమార్ మాట్లాడుతూ.. తాను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుండి కష్టపడి గెలిచిన జట్టు ట్రోఫీని తిరస్కరించడం ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ విజయం మాకు సులువుగా రాలేదు. మేము ఈ టోర్నమెంట్‌లో చాలా కష్టపడ్డాం.. అందుకే మాకు ట్రోఫీ దక్కే అర్హత ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా, “అసలైన ట్రోఫీలు నా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాయి. నా 14 మంది సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బందే నా నిజమైన ట్రోఫీలు. ఈ ఆసియా కప్ ప్రయాణంలో వారే నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారని భావోద్వేగంతో తెలిపారు. ఈ సందర్భంగా సూర్యకుమార్ ఒక సంచలన ప్రకటన కూడా చేశారు. ఈ టోర్నమెంట్ లో తనకు వచ్చిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనితో క్రికెట్ అభిమానులు మాత్రమే కాకుండా ప్రముఖులు, నెటిజన్స్ కూడా సూర్య చేసిన పనికి శబాష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
I have decided to donate my match fees from this tournament to support our Armed Forces and the families of the victims who suffered from the Pahalgam terror attack. You always remain in my thoughts 🙏🏽
Jai Hind 🇮🇳
— Surya Kumar Yadav (@surya_14kumar) September 28, 2025
తాజావార్తలు
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!