NTV Telugu Site icon

Samantha: దయచేసి చిన్నచూపు చూడకండి.. కొండ సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత

Samantha

Samantha

మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై నటి సమంత స్పందించింది. తన విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థించింది. సోషల్ మీడియా వేదికగా సమాధానమిచ్చింది. “స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి.. చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారూ, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు వాల్యూ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలానే ఉండాలని కోరుకుంటున్నాను” అని పేర్కొంది.

READ MORE: Vizianagaram: రాడ్లతో టోల్గేట్ సిబ్బంది హల్చల్.. ఓ కారు డ్రైవర్పై దాడి

ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణం అని కీలక వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వే (కేటీఆర్) కదా? అని ప్రశ్నించారు. హీరోయిన్ల జీవితాలతో అడుకుంది కేటీఆర్ అన్నారు. మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అని తెలిపారు. దొంగ ఏడుపులు నాకు అవసరం లేదన్నారు. సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు. హరీష్ రావు మనసున్న మనిషిగా స్పందించారు. నివేందుకు రియాక్టు కాలేదు..మనిషివి కాదా..పశువు వా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నీకు తల్లి లేదా అని మండిపడ్డారు. మూడు అకౌంట్ లు దుబాయ్ నుండి పోస్టులు పెడుతున్నారన్నారు. మనసుల మధ్య అనుబంధాలు సంబంధ విలువలు ఉన్నాయా నీకు అని ప్రశ్నించారు. కొంతమంది హీరోయిన్లు తొందర పెళ్లి చేసుకోవడానికి కారణం కేటీఆర్ అన్నారు.