Mehreen Pirzada: మెహ్రీన్ పిర్జాదా ‘ఎగ్ ఫ్రీజింగ్’.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mehreen Pirzada’s Egg Freezing Video: ప్రస్తుతం రోజుల్లో కెరీర్, వ్యక్తిగత కారణాల వలన ప్రెగ్నెన్సీని చాలా మంది మహిళలు వాయిదా వేసుకుంటున్నారు. అలాంటి వారికి ‘ఎగ్ ఫ్రీజింగ్’ (అండాల శీతలీకరణ) ఓ వరంగా మారిందని చెప్పొచ్చు. వయసులో ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరచుకొని.. కావాల్సినప్పుడు పిల్లలను కనే వెసులుబాటు కల్పిస్తోన్న ఈ సంతాన పద్ధతిని చాలా మంది పాటిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోగా.. తాజాగా ఆ లిస్టులో మెహ్రీన్ పిర్జాదా చేరారు.
తాను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్లు మెహ్రీన్ పిర్జాదా స్వయంగా తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ.. ‘నా ఎగ్ ఫ్రీజింగ్ జర్నీ’ అని క్యాప్షన్ ఇచ్చారు. ‘ఈ ప్రక్రియకు వెళ్లడానికి నా మనసును సిద్ధం చేసుకోవడానికి 2 సంవత్సరాలు ప్రయత్నించా. చివరకు ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను’ అని మెహ్రీన్ పేరొన్నారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎగ్ ఫ్రీజింగ్ కోసం మెహ్రీన్ ఎంతలా కష్టపడ్డారో వీడియో చూస్తే అర్ధమవుతోంది.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
Also Read: BSNL CinemaPlus Plan: బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్‌లకు గుడ్‌న్యూస్.. సగానికి తగ్గిన ప్యాక్ ధర!
‘నా వ్యక్తిగత విషయాన్ని అందరితో పంచుకోవాలా? వద్దా? అని ఆలోచించా. కానీ నాలాంటి చాలా మంది మహిళలు ప్రపంచంలో ఉన్నారు. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో లేదా బిడ్డను ఎప్పుడు కనాలో అని ఇంకా వారు నిర్ణయించుకోలేదు. భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యం అని నేను భావించా. ఇది నిషిద్ధ అంశంగా పరిగణించబడుతున్నందున దీని గురించి ఎక్కువగా మాట్లాడలేము. సాంకేతికత సహాయంతో మన కోసం మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాము. తల్లి కావాలనేది నా కల. అయితే కొన్ని సంవత్సరాలు ఆలస్యం కావొచ్చు. అందుకే ఈ ఎగ్ ఫ్రీజింగ్. ఆసుపత్రులంటే ఫోబియా ఉన్న నాలాంటి వారికి ఇది సవాలుగా ఉంటుంది. హార్మోన్ల ఇంజెక్షన్ల కారణంగా నేను ఆసుపత్రికి వెళ్లిన ప్రతిసారీ కళ్లు తిరిగి పడిపోయా. ఇది విలువైనదేనా అని నన్ను అడిగితే.. కచ్చితంగా అవును అని చెబుతా. మీరు ఏ పనిని ఎంచుకున్నా.. మీ కోసం చేయండి. ఎప్పుడూ నా పక్కనే ఉన్న నా గైనకాలజిస్ట్ డాక్టర్ రిమ్మీ, మా అమ్మకు ధన్యవాదాలు’ అని మెహ్రీన్ పిర్జాదా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?