Site icon NTV Telugu

Kani Kusruti :  ‘కమిట్‌మెంట్’ కోసం.. నాతో కాకుండా మా అమ్మతో బేరాలు ఆడారు.. నటి సంచలన వ్యాఖ్యలు!

Kani Kusruthi

Kani Kusruthi

గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోవాలని వచ్చే ఎంతోమంది యువతులకు ‘క్యాస్టింగ్ కౌచ్’ అనేది ఒక పీడకలలా మారుతోంది. తాజాగా మలయాళ విలక్షణ నటి కని కుశృతి తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ సంచలన నిజాలను బయటపెట్టారు. అవకాశాల కోసం కొందరు దర్శక నిర్మాతలు ఎంత నీచానికి దిగజారుతారో ఆమె వివరించిన తీరు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది.

Also Read:Valentines Day 2026: ప్రేమికులకు బంపర్ వీకెండ్.. ఈ 5 రొమాంటిక్ ప్లేసెస్ ట్రై చేయండి..మీ పార్ట్నర్ ఫిదా అవ్వాల్సిందే!

మలయాళంతో పాటు తెలుగులో మహేష్ బాబు ‘స్పైడర్’ వంటి చిత్రాల్లో నటించిన కని కుశృతి, తన అద్భుత నటనతో ఎన్నో అవార్డులను అందుకున్నారు. అయితే, ఒకానొక సమయంలో ఆమె సినిమాలకు విరామం ప్రకటించడం వెనుక ఉన్న అసలు కారణం లైంగిక వేధింపులేనని తాజాగా వెల్లడించారు.. ‘నేను మంచి నటిని అనిపించుకోవాలని ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఇక్కడ ప్రతిభ కంటే ‘కమిట్‌మెంట్’కే ప్రాధాన్యం ఇస్తారని అర్థమైంది. నాతో మాట్లాడటానికి భయపడే వారు, ఏకంగా నా తల్లిని కలిసి.. నీ కూతురికి అవకాశాలు రావాలంటే ఆ సుఖం ఇవ్వాల్సిందేనని మొహం మీదే అడిగేవారు’ అని కని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వేధింపులు భరించలేక సినిమా రంగానికి దూరమయ్యానని, కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా మళ్లీ నటించాల్సి వస్తోందని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.

Exit mobile version