Janhvi Kapoor: పక్షవాతానికి గురయ్యానా అనిపించింది.. ఆ మూడు రోజులు చాలా భయంగా గడిచాయి: జాన్వీ
- అస్వస్థతకు గురైన జాన్వీ కపూర్
- వాష్ రూమ్‌కు కూడా వెళ్లలేకపోయా
- చాలా భయంగా గడిపా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor talks about Hospitalisation: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇటీవల ఫుడ్ పాయిజన్‌కు గురైన విషయం తెలిసిందే. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె హుటాహుటిన చెన్నై నుంచి హైదరాబాద్‌కు చేరుకొని.. చికిత్స తీసుకొని కోలుకున్నారు. మూడు రోజులు ఆస్పత్రిలో ఉండి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా జాన్వీ ఆస్పత్రి అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. ఆ మూడు రోజులు చాలా భయంగా గడిచాయని చెప్పారు. ఈ సంఘటన తర్వాత పని కంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
జాన్వీ కపూర్ మాట్లాడుతూ… ‘ఇటీవల రోజుల్లో షూటింగ్‌లు, ప్రమోషన్స్‌తో చాలా బిజీగా ఉన్నాను. విరామం లేకుండా ప్రయాణాలు చేసి షూటింగ్‌లలో పాల్గొన్నాను. దీంతో చాలా వీక్ అయ్యాను. ఓ సాంగ్ షూటింగ్ కోసం చెన్నై వెళ్లా. అక్కడ బయట ఫుడ్ తిన్నాను. మొదట కడుపులో నొప్పిగా అనిపించింది. ఆ తర్వాత చాలా నీరసంగా మారింది. తలనొప్పి, వణుకు వచ్చాయి. చాలా టెన్షన్ పడ్డాను. హైదరాబాద్‌కు వచ్చేందుకు ఫ్లైట్ ఎక్కేముందు పక్షవాతానికి గురయ్యానా? అనే భావన కలిగింది. సాయం లేకుండా వాష్ రూమ్‌కు కూడా వెళ్లలేకపోయాను. నడవడానికి కూడా ఓపిక లేదు’ అని తెలిపారు.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
Also Read: Malavika Mohanan: అలాంటి సన్నివేశం ఉంటుందని డైరెక్టర్ చెప్పలేదు.. తప్పక చేయాల్సి వచ్చింది!
‘మూడు రోజులు హైదరాబాద్‌లో చికిత్స తీసుకున్నాను. చాలా భయంగా గడిపా. అప్పుడే పని కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. ఆసుపత్రిలో ఉన్న ఆ మూడు రోజులు మళ్లీ డ్యాన్స్ చేయగలనో లేదో అని భయపడ్డా. ఇప్పటికీ పూర్తి ఫిట్‌గా లేను. ఇప్పుడిప్పుడే వర్క్‌లో బిజీ అవుతున్నాను’ అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జాన్వీ ఉలఝ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?