Malavika Mohanan: అలాంటి సన్నివేశం ఉంటుందని డైరెక్టర్ చెప్పలేదు.. తప్పక చేయాల్సి వచ్చింది!
- విక్రమ్ హీరోగా తంగలాన్
- ఆగస్టు 15న విడుదల
- తప్పక చేయాల్సి వచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malavika Mohanan Cooments on Thangalaan Shooting: పా.రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా ‘తంగలాన్’. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తు కీలక పాత్రలు చేశారు. ఆగస్టు 15న తంగలాన్ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక.. షూటింగ్ రోజులను గుర్తుచేసుకున్నారు.
ఇంటర్వ్యూలో మాళవిక మోహనన్ మాట్లాడుతూ… ‘ఒకరోజు నేను సెట్‌కు వెళ్లే సరికి పెద్ద గేదె ఉంది. డైరెక్టర్ నా వద్దకు వచ్చి దానిపై ఎక్కగలవా అని అడిగారు. ఏదో సరదాగా అన్నారనుకున్నా. నా మేకప్ పూర్తయిన తర్వాత గేదెపై కూర్చోమన్నారు. నేను ఎప్పుడూ గేదె పైకి ఎక్కలేదని చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. షూట్ చేయాలి, గేదెపై కూర్చో అన్నారు. చాలా భయంతోనే దానిపై ఎక్కాను. త్వరగానే ఆ షాట్ పూర్తయింది. అలాంటి సన్నివేశం ఉంటుందని డైరెక్టర్ నాకు ముందుగా చెప్పలేదు. అందుకే ఒక్కసారిగా షాక్ అయ్యా’ అని తెలిపారు.
Also Read
- Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
- AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
- Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
Also Read: Cobra Viral Video: మద్యం మత్తులో నాగుపాముతో ఆటలాడిన నాగరాజు.. కాటు వేయడంతో పరిస్థితి విషమం!
‘తంగలాన్ సినిమా కోసం నేను 5 గంటలు మేకప్ వేసుకోవాల్సి వచ్చింది. స్కిన్ స్పెషలిస్ట్, కంటి డాక్టర్ ఇలా ఐదుగురు వైద్యులను కలిశాను. ఒక్కోరోజు దాదాపు 10 గంటల పాటు కెమికల్స్‌తో చేసిన మేకప్ శరీరంపై ఉండేది. దాంతో నాకు ఎలర్జీ వచ్చింది. ఒక్కోసారి ఈ షూటింగ్ ఎప్పుడు అయిపోతుందా? అని అనిపించింది’ అని మాళవిక మోహనన్ చెప్పారు. తంగలాన్‌లో నటీనటులందరూ డీ గ్లామరైజ్‌గా కనిపించనున్నారు. అందుకు భారీగా మేకప్ వేసుకోవాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
-
Konda Surekha : కొండా సురేఖ రివర్స్ కౌంటర్.. ‘నా కూతురు మాటలకు నేనెందుకు?’
-
AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
-
Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!